పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జాడల తిరగక నడచిన
యాడికగాదే నిశాచరాళి తెగడరే!

175

ఆశ్వాసాంతము

క.

చండద్విపతుండ[1]నిభో
ద్దండభుజాదండపరశుదండితరిపురా
ట్కాండశిరో[2]మకుటమణీ
మండితమహితాహవక్షమాదిగ్భాగా!

176

ముక్తపదగ్రస్తము

చ.

అమలవిచార చారణనగాపహవిక్రమసంగ సంగర
క్రమఘనదక్ష దక్షజనకస్ఫుటమానసధామ ధామవి
భ్రమజితమిత్త్ర మిత్త్రపరిపాలననీతినిదాన దానవా
గమసురరాజ రాజకులఖండనఘోరకుఠారభృత్కరా.

177


స్రగ్విణీవృత్తము.

దీనచింతామణీ, దేవతాగ్రామణీ
భానుకోటిద్యుతీ, భార్గవీహృత్పతీ
గాననాదక్రియా, గర్భలీలోదయా
దానవీభంజనా, ధర్మబోధాంజనా.

178

గద్య
ఇది శ్రీమత్కర్పరాచల లక్ష్మీనృసింహ వేంకటేశ్వర వరప్రసాదలబ్ధ సకలై
శ్వర్య ధురీణ శారదాప్రశ్నవివరణ శతఘంటావధాన వినయధునీ
తరంగవిజృంభణాజృంభిత సలలితమృదుమధురవాగ్వైఖరీఝరీధురీణ
స్థాపిత శేష విశేషప్రసిద్ధ సాహిత్య సారస్వతాశుకవితాష్ట
భాషావిశేష సంస్కృతాంధ్ర నిరోష్ఠ్యోష్ఠ్యాది వింశతి
ప్రబంధనిర్మాణధురీణ మౌద్గల్యమహర్షి గోత్ర పవిత్ర
తిరుమలదేశికేంద్ర పౌత్ర తిరువేంగళాచార్య పుత్ర
మఱింగంటి సింగరాచార్య కవిరాజప్రణీతంబయిన
దశరథరాజనందనచరిత్రయను నిరోష్ఠ్య
మహాప్రబంధంబునందు జతుర్థాశ్వాసము.

  1. నమో (ము)
  2. మణిమకుట (ము)