పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

అనిన యతనిగాథ లాలించనేరక
యల్క నడఁచి నీతి యతిశయిల్ల
దాయిఁ గాంచి కాంచి దశకంఠలేఖారి
యందఱ ల్గణించ నాడె నంత.

168


చ.

అసదృశశక్తి నెత్తితిఁ దృణాకృతి నాగిరికన్యకాగిరీ
శసహితతారకాద్రి హరశక్రధనంజయదండదైత్యనా
థ సరిదధీశ కార్థిగతి దాస్యగతిన్ జరియించ నన్నిటన్
నెసఁగితి, నాతగాని కిఁక నేల చలించ నిశాటశేఖరా!

169


తే.

ఆజి నీయంతదాయి నాయండ నిలచె
నన్న సత్కీర్తి కెంతె కా కధికశక్తి
కిన్కచే దాశరథిఖిని, గీశరథికి
జడసెనా, నీసడించరె జన్యధాత్రి.

170


క.

నిచ్చనిరాహారక్రియ
హెచ్చిన నేనని రచించ కీల్గితినేనిం
జెచ్చెఱ హరధాతల్ నా
కిచ్చిన కాంక్షాతిశయత లేగతి యయ్యెన్.

171


ఉ.

సీతయె కంధినందనగఁ, జెంత ఖరారియె శేషశాయిగా
నీతి ఘటిల్లగా నెఱుఁగనేరనె! దాచఁగ నేటి కాజి నే
నాతనిచేతఁ ద్రెళ్లీ సనకాదియతిచ్ఛట లందలేని యా
ఖ్యాతిఁ డనర్చి సద్గతికిఁ గాఁచితిఁ జిల్లరగాథ లేటికిన్.

172


ఆ.

శిష్టరక్ష నహితశిక్ష సేయంగ దై
త్యారి ధర జనించె నంటి గనక
సీత నిచ్చి లజ్జ చెడిన దింతియెగాక
తిరిగి చనఁగనేరఁ డరయరాదె.

173


వ.

అని యాడిన దశకంఠలేఖారిం గాంచి.

174


క.

ఆడదగినట్టి నయగతి
యాడినతెఱఁ గింతెగాక యకటా నే నీ