పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జిరతర కఠినాంఘ్రీకరదంతసంసర్గ
             ఛిద్రలై నల్దిశల్ చెదరిరాల
నిగిడి గాంగేయశిఖరి కెళ్లెగసి చాల
చండచండాకృతి ధరిత్రి సాగెననఁగ
శయ్యకడ నిద్రజెందెడి శస్తకలశ
కర్ణఖచరారి నీక్షించి కదియనేగి.

154


తే.

అఖిలకరతాడనక్రియ నశనినాద
హరణ కఠినాట్టహాససంసరణి దండ
దళితనిస్సాణధణంధణల నిద్రఁ
దెలియజేయంగనేరక తిరిగి తిరిగి.

155


సీ.

దహనతీక్ష్ణకటాహతైలధారల్ నాసి
             కాంతస్థలి దిగంగ నానియాని
కైలాససంకాశగండశిలల్ దెచ్చి
             డాసి నెత్తిఁ దటాన నేసియేసి
గంధగంధిలదంతి కఠినశృంగాగ్రస్థ
             సితహేతి లతికేలఁ జెలఁగి చెలఁగి
శక్తిసాయకగదాచక్రాసిరాజిసా
             ధనతతి క్షితిచేతఁ దరఁగి తరఁగి
ఝల్లరీతాళనిస్సాణశంఖకాహ
ళాట్టహాసక్రియలచేత నార్చి యార్చి
నిద్ర తెలియంగఁ జేసిరి నిలచి కలశ
కర్ణఖచరారి యత్యంతగాఢశక్తి.

156


క.

ఈరీతి నారగించిన
యారాక్షసకర్తఁ జేరి యతిరయగతి లం
కారా జచ్చటికిని ని
న్నారయ రా ననిచెనన్న నల్లన లేచెన్.

157