పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఇట్ల లేచి నిలచిన.

158


ఉ.

కానక నింగి [1]నీరరథగజ్జెల తాళనిదానఁ జేసి గ
ర్జానినిశాకరచ్ఛటలఁ జక్కఁగ దెచ్చి ఖరారిఁ జేరఁగా
యానిజ జాడ నిల్చి చని యార్తి ఘటిల్లఁగఁ గీశసేన లా
హానినదక్రియన్ ఖర ఖరారి యదాటల డాగె నయ్యెడన్.

159


ఆ.

కలశకర్ణదైత్యకర్త యాయాస్థాని
యన్నకాళ్ల కెఱఁగి యతనియాజ్ఞఁ
దగిన గద్దె నిల్చి తహతహ నల్దిశల్
గాంచి యధికచిత్రగతి గణించి.

160


క.

నెలలేని రాత్రి జాడన్
గలయఁగ నాస్థానసరణి గానఁగ నయ్యెన్
దెలియఁగ గనిష్ఠసహజని
కలదా? లేదా? యెఱుంగఁగా జేయఁగదే.

161


వ.

అనినఁ గలశకర్ణఖచరారిఁ గాంచి యనేకచర్యల గణియించి దాశరథి
దండకారణ్యాని కేతెంచి సకలజటినేతల్ గీర్తించిన రాక్షససంతతి
సంహరించ శరతి(?) రచియించి లాలించిన, శక్తి చెల్లెలైన రక్కెస కర్ణ
నాసికల్ గీయించినసరణి ఖరాదిరాత్రించరకర్తల ఖండించిన దండి
యది గనక జనకతనయం జేరఁదెచ్చిన నడక, యాంజనేయహరి దాని
జాడ నేతెంచి యతని గేహిని నరసి, శృంగారకాంతారశాఖిరేఖలఁ
ద్రెళ్లన నడఁచి యక్షకహంతయై, లంకారాజధాని నగ్నిశిఖచే స్రగ్గించి
తిరిగి చనిన కరణి, కైకసికనిష్ఠనందననిశాటనేత యరాతి నాశ్రయిం
చిన దాశరథి గిరిచరసేనలచే గట్లకట్ట కట్టించి సాలాంగణస్థలి నాగిన
నాద్యంతస్థితి దశాననరాక్షసాగ్రణి యెఱిఁగించిన నర్థఘటిక చింతించి
యన్న కిట్లనియె.

162


మ.

అకటా! కాఁగల కీ డెఱుంగక నిశాటాధీశ నిరీతి జా
నికిఁ దేనేల! ధర న్నరేంద్రతనయల్ నాగాంగనల్ సారక

  1. నీరధర (శి. గ.)