పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఈ నరఖాదాగ్రణి నె
య్యాన [1]సదాచార నియతియలరి నడచె నా
నేనైనం నిర్జించం
గా నేర నటన్న నార్కికాక ఘటిల్లన్.

43


క.

నాతల్లి యైన ధరణీ
జాతం [2]దాశరథి చరణజలజధ్యాన
దశరథరాజనందన చరిత్ర
ఖ్యాతక, రక్షితజనసం
ఘాతన్, జెఱసాల నిడియె గాయని ఢాకన్.

44


సీ.

సింగిణియల్ల నా నింగికి నెగసిరా
             [3]సకలసంహారాతిశయతచేత
నాస్థానియై నిల్చినట్టి లంకానేతఁ
             జేరి చండతరాజి [4]జేసియంత,
దండనాయకరాజి దండించి కాంచన
             ఘటరత్నకేతనకలితరాజి
శాలలనన్నింట జగతి ద్రెళ్లఁగఁ దన్ని
             ఢాక లంకారాజధాని గలఁచి
దృఢజయానందసాహసశ్రీలఁ దనరి
తిరిగి యేతించి దాశరథిక్షితీశ
హేళిఁ గదియంగ జని కాళ్ల కెరఁగి కీశ
సేన లెన్నంగ దనరారెఁ జిత్రకళల.

45


వ.

అయ్యెడ లంకానేత కిరసారణాఖ్యాకచారనిశాచరకర్తలచే దాశరథి
శృంగగిరి శిఖరి ననంతసంఖ్యలైన గిరిచరసేనలచే నిలచిన జాడఁ దెలసి.

46


క.

హరసఖదిగ్రాజగృహా
గ్రరసాస్థలితాదశాస్యఖచరారి నిరం
తరహితసంగతి నిలిచెన్
సరగన [5]లెక్కించరాని ఛత్రచ్ఛాయన్.

47
  1. సదాచారనియతి (శి)
  2. దాశరథి చరణధూపఖ్యాతన్ (శి) దాశరథి...దాన (ము)
  3. సకలసన్నాహాతి
  4. చేసిచెంత
  5. లెక్కించరాని (శి)