పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

తెలియంగ సెలఁగకే, లర
సెలఁగ దలలచేతఁ దనర రత్నశిలా
కలితాలంకారస్థితి
నలరెన్ లంకాధినేత నల్లనఁ గంటే.

38


సీ.

కాలాగ్ని తీక్ష్ణఖడ్గలతల్ ధరించె రెం
             డెడల రాక్షసకర్త లెచ్చరించ
నయశాస్త్రచణదండనాయకచ్ఛటలకా
             ర్యాకార్యనర్తన లతిశయిల్ల
[1][2]జగతిరసాతలగగనచారేశిత
             లయ్యెడ జయలిడ హాస్యగతిని
నాకనాథజిదాదినందనరేఖల
             సాహసాలంక్రియల్ సందడిల్ల
నసదృశహిరణ్యఖచితసింహాసనాగ్ర
ధర నధిష్ఠించిన దశాస్యదైత్యనేత
కట్టె సాక్షాత్కరించిన కాలదండి
దండి దనరారె నంతంత ధరణినాథ.

39


వ.

అని యాడిన దాశరథి సంతసిల్ల లంకానేతం గాంచి.

40


తే.

ఎంతసిరి ఎంతయాకృతి యెంతశక్తి
యెంతతే జెంత నిల్కడ యెంతదండి
యట్టిసాహిసి గాంచిన యట్టితల్లి
సత్క్రియ గణించగలఁడె యాస్రష్టయైన.

41


చ.

అగజాజాని ననేకకంధరలచే [3]నర్థించె జన్యస్థలిన్
దిగధీశాదితినందనచ్ఛటల నర్థిం గెల్చి శంకించకే
తెగి కైలాసగిరిన్ దృణాకృతిగ నెంతేగాన నీతండహా
జగదారాధ్యత హెచ్చనేరఁడె సదాచారక్రియన్ జెందినన్.

42
  1. ఈపాదము సగమే యుండఁ దక్కినదాని బూర్తి గావించితి - ఇట్లు లేఖనకర్త (ము)
  2. జగతిరసాతలఁగగనచారిత లయ్యెడను నెదలందు జంకును ధరించి (ము)
    జగతిరసాతలగగనచారేశిత లయ్యెడిం జయలిడి హాస్యగతిని(శి)
  3. నర్చించి జన్యస్థలిన్ (శి)