పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

చేరంగఁజీఱి యతనిని
నీరఫ్నాయిగ రచించి నిల్కడగా లం
కారాజ్యకర్త జేసెద
యారాశిఖరారి సాటి యరయఁగ గలరే.

18


వ.

అయ్యెడ.

19


క.

ఆరాజహేళి హితగతి
నారసనిధిస్నాయియై దినత్రయి తృణశ
య్యారస శయనించె నీరా
హారక్రియచేత నిష్ఠ యతిశయిలంగన్.

20


చ.

జలనిధి గాంచి దాశరథి చక్కఁగ సాగిలి లేచి నిల్చినన్
లలితతరంగనిర్గతఝళంఝళ లెల్లెడ హెచ్చ, తారకా
స్థలిఁ దెలియంగ నిక్క, దనసనంగడి చక్కనిదాయి కాస్థితిన్
తెలియఁగఁ జేసి హృజ్జనితతీక్ష్ణతరాగ్రహదృష్టిఁ బేరఁగన్.

21


క.

దాశరథి నింగి యంటిన
నాశరనిధి కెగసి కరశరాసనయష్టిం
దాశరథి శస్త్రిఁ దిగిచి ది
గీశరథికలేఖ లెన్న నెద సంధించెన్.

22


వ.

అంత.

23


క.

ఆనారాచక్రియఁ గని
దీనాకృతి జలధి జడసి ధృతి ధరణీజా
జానిచరణాగ్రసంస్థలి
కానతి రచియించి కీలితాంజలిచేతన్.

24


ఉ.

ఇంతనె నాతెఱం గరయ కీర్ష్య ఘటిల్లఁగ లేచి కేల న
త్యంతశరాసయష్టి నరిస ల్గెనయించఁగ నేల నాదినీ
సంతతి రాజసంతతి రసాస్థలి కార్యగతిన్ రచించ దై
త్యాంతక సాగరాఖ్యఁ దనరారితిఁ జిల్లరగాథ లేటికిన్.

25