పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

జగతి నిట్టి సగరసంతతి సాక్షాత్క
రించి యాది హరి జనించె నన్న
కాంక్ష నలరినాడ కాక సేయఁగ [1]నెద్ది
దారి కీర్తిఛారి! తాటకారి!

26


క.

నీచరణదర్శనస్థితి
నీచరణ[2]క్షాలనాదినియతఖ్యాతిన్
నీచరణారాధనగతి
యాచరణశ్రీ ఘటిల్లెనయ్య నరేంద్రా!

27


ఆ.

అనిన ఖరనిశాచరారి యాగాథల
కలరి కినియకే శరాసయష్టిఁ
జిత్రశస్త్రఘటన జేసితి నిది రిత్తఁ
గాదటన్న జలధి [3]కలఁగనాడె.

28


క.

అనఘా! నీచే సంధిం
చిన సాయకధార రిత్త సేయఁగరాదే
గనక తెలియంగఁ జేసెద
ననతక్రియ దీనిలెస్స నాలించఁగదే.

29


క.

ధనదాశ, ననంతనరా
శనకర్తల్ గలరయా రసనాయక! త
ద్ఘనశస్త్రికచే నందఱ
గనియలు సేయంగరాదె గ్రచ్చఱ ననినన్.

30


చ.

శరనిధి యాజ్ఞ దాశరథి చండశరాసనయష్టిశింజినీ
ఖరతరశస్త్రి నేయఁ [4]దనకాంతి దిగంతనిశాటసంతతిన్
సరగ హరించి తాఁ దిరిగి చండశిఖల్ నెరయంగఁ జేరి త
చ్ఛరధి దనర్చె ఖేచరరసాచరకీర్తన లెచ్చ నయ్యెడన్.

31


క.

తనచెంగటి హరిసేనలఁ
గని, నీరధి గట్లచేత గట్టఁగ శాసిం

  1. నద్ది (ము)
  2. క్షారనాథినయతఖ్యాతిన్ (ము)
  3. కనఁగనాడె (ము)
  4. ధనకాంత (శి)