పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని యాస్థాని గ్రక్కటిల్లఁ గ్రీగంట రక్తజలధారల్ జార జండనిర్ఘాత
నాదతిరస్కారదంతసంతానసంఘటితకిటగిటల్ నెఱయ దీర్ఘనాసిరంధ్ర
నిర్గతానిలాహతి నంగయష్టి కంద దశశీర్షచిరతరత్నకిరీటనిగనిగచ్ఛాయల్
జదలంట సితశాఖకంటకారకేశచ్ఛట లల్లలనాడ నాతతజఘనఘనా
ఘననిర్జాడ్యగర్జాగాధతర్జనలం జెంగలించ నగ్రస్థలి నీతికార్యదక్షదండ
నాయక సంహతిఁ గాంచి శరశరాసనఖడ్గచేలాంగలగదల్ దెండవ సదృశ
కంఖాణగంధగంధిలకరటికాంచనశతాంగసైనికతతి కర్హక్రియ లలంకరిం
చిన యదిగండనిస్సహణనిస్సాణఢక్కానకఝల్లరీఘంటాశంఖకా
హళ రం తదరఁజేయ నిఖిలహితనిశాచరకర్తలకందఱికి లేఖ ల్లిఖియించిన
నది లెస్సయని నెయ్యి [1]చిలికించిన కాలాగ్ని నాఁ గెరలి యహంకరించి
గద్దించి యంతటం గలయ నధిష్టించి.

148


క.

తనయాసానధరిత్రిన్
ఘనరాక్షసకర్త నీతికార్యనిధి దశా
ననరాత్రించరనేతన్
గని దానక్షాత్రసరణిఁ గణియించెఁ గృతిన్.

149


క.

అరనీటకకర్తధృతిన్
హరిసేనలఁ గలసి చన్న నకటా! యెదని
(?)ర్జరకంజన జరియించన్
శరణియె హరికర్తలైన సరి యనగలరే.

150


అరచేత నే నింగినాన శేషాహి
             తలలడంగ ధరిత్రిఁ దన్నలేనె
కలఁచనే జలరాశి గడలెల్ల జారంగ
             నలయంగ గాలాగ్ని నడచలేనె
గట్లన్ని యచ్ఛనగండ్లగాఁ గీటనే
             యార్కిదంష్ట్రలు రాల [2]నణఁచలేనె
శక్రాది నిర్జరసంహతిఁ ద్రాళ్లచే
             గట్టి యంగడియడ్డ గట్టలేనె

  1. చెలికించిన (ము)
  2. నలచ (ము)