పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తెలియ నీయాజ్ఞ యెంతైనఁ గలిగెనేని
యెంతటికినైన నిలిచెదఁ జింత యేల
యశనిసంకాశ కఠినాట్టహాస సంచ
లీకృతారాతిరాట్కేయ! కైకసేయ!

151


క.

[1]న న్నచటికి శాసించిన
దిన్నఁగ రానేల దెచ్చి తృణగతిగా నీ
సన్నిధి నిడియెద నాయెడఁ
గన్న ననర్హగతి గల్లఁ గాంచెద నిచటన్.

152


క.

అని యాడినట్టి గాథల
ననతానందజలరాశి నలరిన దశకం
ఠనిశాచరక్షితీశితఁ
గని హితజనరేఖ లెల్లఁ గణియించి రటన్.

153

ఆశ్వాసాంతము

క.

పురుహూతాదిదిశాధీ
శ్వరసముదయమస్తకాగ్రసంస్థితమకుటీ
నరమణినీరాజనవి
స్ఫురితపదాంభోజయుగళ సురుచిరనఖరా!

154

ముక్తపదగ్రస్తము

చ.

వనథినిశాంత శాంతమునివర్గహృదామరభూజ భూజభం
జనదృఢచక్ర చక్రసఖసారసవిద్విషదక్ష దక్షజా
తనురిపువంద్య వంద్యభినుతప్రతిభాగుణజాల జాలవ
ర్తనకృతలోక లోకహితధర్మవిచార యుదారవైభవా!

155


(?)

కలశనారథికన్యకాకృతి[2]కామ్రసుకృతిఫలోదయా
లలిత[3]యాగహుతారితనుకీలాలపూర్ణసరిచ్చయా
మలహరాదిగిరీశసేవితమంజులాంఘ్రికుశేశయా
జలజచక్రగదాసికార్ముకసంగ్రహాచ్ఛచతుశ్శయా.

156[4]
  1. అన్నచటికి (ము)
  2. కమ్ర (శి)
  3. పరశు (ము)
  4. 156 సంఖ్యగల పద్యము ‘ము’లో ‘మత్తకోకిల' యని గలదు కాని లక్షణము సరిగా లేదు.