పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సారథి నిజనగరస్థలి
కారయఁ దిరుగంగ ననిచె నాయెడ నంతన్.

131


ఉ.

శ్రీనిధియైన దాశరథి చేరఁగ నేగిన, గందరాఖ్యచే
గానఁగనైన దాసజనకర్త దృఢార్చన లాచరించి గం
గానది దాటఁజేసి హితకాండ సహాయత సాగనిచ్చినన్
దానికి సంతసిల్లె దనదాసజనాగ్రణి గాగ రాజిలెన్.

132


చ.

చనిచని కాంచె చెంగట నిశాచరహంత, సతీసహాయతన్
ఘనతరకేతకీకదళికాహరిచందనకందరాళకాం
చనఘనసారతాళగణసంచితకాననధాత్రి నండజా
ఖ్య నతిశయిల్లి నట్టి జటి నంచితశిష్యజనచ్ఛటాతతిన్.

133


ఉ.

ఆయతిచేత నంత నిఖిలార్చన చర్చ లెసంగఁగా, ధరా
నాయకహేళి, తాఁ దగిననా ళ్లచటన్ లతికా[1]గృహచ్ఛటా
చ్ఛాయల సంచరించి, క్షితిజాసహితస్థితి దాయి రాగ [2]
త్యాయత చిత్రశృంగగిరి దారి దగం జనసాగె నయ్యెడన్.

134


శా.

నానా డేఁగ నఖండఖడ్గహరిణీనాగాండ[3]జాహ్యాద్యర
ణ్యానిం గాంచి యగాధనీరధరనచ్యాళిన్ దగం దాటి తా
నానారత్నతటాకహాటకదరీనాకాంగనాదిత్యసం
తానాచ్ఛాదితచిత్రశృంగగిరిచెంతం జేరి రా జయ్యెడన్.

135


తే.

అక్కడి యతీంద్రసంతతి యర్థి నాద
రించఁగా దళశాలలన్ రచించఁ దాట
కేయదైత్యారి నిలిచె నాక్షితజ గలసి
సరసగాథల హర్షాతిశయత నంత.

136


క.

డాక జయంతఖరాగ్రణి
కాకాకృతిఁ దాల్చి చరణకరనఖతతి, ధా
త్రీకన్యయంగలత, న
త్యాకాంక్షను జీరి నింగి కల్లన నెగసెన్.

137
  1. గృహచ్ఛలన్, ఛాయల (ము)
  2. నధ్యాయత (ము)
  3. జాహోదర