పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

చెనకి రయక్రియన్ చెగసి చెంగట నిల్చినయట్టి హంతఁ దాఁ
గిన నలి నేసె, నేయ నది గ్రచ్చఱ నీఱయి, నాయడంచ జా
లనికతనన్ వడిం దిరిగిరా నల రానెల యంఘ్రి సాగినన్
గినియక కాఁచెగా యతనికిన్ సరిగాఁ గలరే జగత్త్రయిన్.

138


శా.

సీతాసంగతి రాక్షసారి హరిణీసింహాహిసారంగసం
ఘాతాచ్ఛాదితకాననక్షితికి నేగన్ దాళ కత్యంతచిం
తాతీక్ష్ణాగ్నిఁ గరంగి యాజి ధరణీధాతృచ్ఛటల్ గంధసం
ఖ్యాతీతత్రిదశస్థలి౯ నిలిచె నాహాకారతల్ తేలఁగాన్.

139


వ.

[1]ఇక్కరణి (గానియాదికేకయరాజనందన కాంక్ష నేగిన) జక్రాంశ
సంజాతనరనేత రాజ్యాధికారిం జేయందలంచి, కైక రాననచినఁ దిరిగి
సాకేతనగరి కరిగి యయ్యెడ.

140


చ.

తనజనయిత్రియాజ్ఞ దలఁదాల్చి ధరాతనయాధినేత కా
ననధర కేగి నంగనలినాకగృహస్థలి జేరినట్టి
జనయిత కట్టడల్ డెలిపి చక్రతళాజనిరాజహేళి తా
నెనయఁగ నన్నఁ జేరఁ జనియెన్ జనితార్తి ఘటిల్ల నయ్యెడన్.

141


ఆ.

గంగ దాసకర్తకతనఁ జక్కగ దాటి
యండజాఖ్యఁ గన్న యతనియాజ్ఞ
సేన లఖిలదిశలఁ జేరసాగె ననేక
సేన లఖిలదిశలఁ జెలఁగె నంత.

142


క.

ఆకలకలనాదక్రియ
నాకర్ణించి హరినాయకాంశజనితధా
త్రీకర్త యాగ్రహస్థితి
గైకేయాయాతసరణిఁగా తెలిసి ధృతిన్.

143


క.

తనయన్న జానకీశిత
నెనయంగా నేగి కెకయీకాంతానం

  1. ఇక్కరణి (గాని యాదికేకయరాజనందన కాంక్షనేఁగిన) (ము) లోగలదు. కుండలీకృతభాగము ఇతరప్రతులలో లేదు.