పుట:దశకుమారచరిత్రము.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

దశకుమారచరిత్రము

     నీహారజలముల నిండారుకుండలు
                    శిశిరగంధముల వాసించువారు
     బిసతంతుపటము లింపెసలారఁ జందన
                    ద్రవమున జొత్తిల్లఁ దడుపువారు
     పువ్వుసెజ్జలును లేఁబొరల వీచోపులు
                    వెరవు పాటించి గావించువారు
ఆ. మలయమారుతంబు నెలమావిజొంపంబు
     నమృతకరు వసంతు నళిచయంబు
     చిలుకపిండు గోయిలలకును మొఱలిడు
     వారు నైరి వీరు వారు ననక.124
వ. మఱియును.125
మ. చిలుకా! పల్కకుమీ లతాంతశరుఁడా! చెల్వం గృపం జూడు మీ
     యళులారా! మొరపంబు దక్కి నిలుఁడీ యాలోలమంచానిలా!
     కలయం బాఱకుమీ పికప్రకరమా! కంఠధ్వనుల్ నల్దెసల్
     చెలఁగం గూయక తక్కుమీ యనుచు రాజీవాస్య లుద్బాష్ప లై.126
క. ఆరమణీతిలకమునకు
     గౌరవమున శిశిరవిధులు గావించినఁ బొం
     గారెడు నేతికిఁ బయిపై
     [1]నీ రలికినయట్లవోలె నిష్ఫల మయ్యెన్.127
వ. అమ్ముద్దియ ననునయింపం దలంచి దానిబహిఃప్రాణంబునుం
     బోని బాలచంద్రిక యి ట్లనియె.128
చ. చెఱకటె విల్లుపువ్వు లటె చిక్కనిచక్కనియమ్ము లేయుచో

.

  1. నీరంబుం జిలికినట్ల