పుట:దశకుమారచరిత్రము.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9

సీ. లక్ష్మీహస్తమునకు లాంఛనం బబ్జంబు హస్తంబ యబ్జ మీయబ్జముఖికి(దశమా. ప. 19)

క. అని పలుకఁగ మృదునూపుర, నినదము రశనాకలాపనినదము వనితా
      జనసరసవచనరచనా, నినదంబును నిండె వర్ణనీయం బగుచున్ . (దశ.23)

ఇటులె యితరవర్ణనములందును మనోహరములగు పద్యములు కలవు. కథాసందర్భములం దున్నభారములు చాలవఱకు మాతృకానుగుణములె గాని వర్ణనాంశములు మాత్రము కేతన ప్రతిభావిశేషమునకుఁ దార్కాణములగు స్వతంత్రపద్యములు. కేతన తేటతెలుఁగునం బద్యము వ్రాయుటయందెగాక సమాసపటుత్వముగ వ్రాయుటలోఁ గూడ గడుసరి.

తేట తెలుఁగు

ఉ. ఇంచుకయేని పెం పెఱుఁగఁ డెంతయు వేడుక నేను బుత్రుఁగాఁ
     బెంచిన మావిమోకకడఁ బ్రీతి మదీయవయస్యయైన యి
     క్కాంచనమాల నెలచెలికత్తెలు నవ్వఁగ నంటఁబట్టె నా
     పంచున కాలనై పడనిపాటుల నేఁ బడితిన్ దపస్వినీ.(సప్తమా. ప. 71)

సమాసపటుత్వమునకు

ము. చటులస్యందనఘట్టనం దెరలి యశ్వవ్రాతచంచత్ఖురో
     ద్భటపాదాతపదాహతి న్నెగసి యుద్యద్వారణశ్రేణికా
     కటవిష్యందిమదాంబువృష్టి నడవంగా భూరజఃపుంజ ము
     త్కటదర్పోద్ధతవృత్తి నొత్తి నడచెన్ దండెత్తి యుద్దండుఁ డై.(ఏకాదశ. 1. 119)

రసవంతములగు పద్యముల నిటులె నుదాహరింపఁబూనితిమేని గ్రంథములోని సగపాలు తొలిపలుకునఁ జేర్పవలసి వచ్చును. ఈ గ్రంథమందలి దొంగతనము వడ్లు దంచుట కోడిపందెములు జూదము అభిసారికాకృత్యములు నరకయాతనలు