పుట:దశకుమారచరిత్రము.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

61

     వృతిఁ బొందఁగ ననుఁ గనుఁగొని
     యతులితశోకాకులాత్ముఁ డై యిట్లనియెన్.40
తే. ప్రాణసమయైన సతిఁ బెడఁబాసి తోసి
     యనఘ! భృగుపతనంబు సేయంగ నిట్లు
     నేలఁ బడకుండ నన్ను నీ వేల పట్టి
     తభిమతంబున కంతరాయంబు గాఁగ.41
వ. అనిన నచ్చెరువంది యతని తెఱం గెఱుంగం దలంచి నీ వెవ్వం
     డ వని యడిగి యిట్లంటి.42
క. సతి నెట్టిభంగిఁ బాసితి
     సతిఁ బాసినమాత్రఁ జేసి చావునకుఁ దెగం
     గత మేమి దీని నంతయు
     వితతంబుగ నెఱుఁగఁ జెప్పవే వినవలతున్.43
వ. అని యడిగిన నతం డిట్లనియె.44
క. ఘనుఁ డగు మగధేశ్వరునకు
     ననుఁ గై పద్మోద్భవాఖ్యుఁ డగు ప్రెగ్గడకున్
     దనుజాతుఁడ రత్నోద్భవుఁ
     డనువాఁడ వణిక్క్రియార్థ మంబుధిలోనన్.45
క. ఓపి మును కాలయవన
     ద్వీపమునకు నరిగి యొకసతిం బరిణయ మై
     యాపొలఁతియు నేనును నీ
     ద్వీపమునకు నరుగుదేఱ విధి చెయ్దమునన్.46
వ. తీరంబున కనతిదూరంబునం గలం బబ్థిలోన [1]బిద్దంబగు
     టయు నెట్టకేనియు మహార్ణవంబు దరిఁ జేరి నిజాంగనా

  1. నిర్భిన్న