పుట:దశకుమారచరిత్రము.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

కేతనకవి దండ్యాచార్యునిభావములు పెక్కుచోటుల యథారూపముగఁ గొంచెము మార్పుగ నిమిడ్చియున్నాఁడు. చూచుట కవి స్వతంత్రభావములవలెఁ దోఁచును.

“భవదంసోపవీతం యజ్ఞోపవీతం భూసురభావం ద్యోతయతి. హేతి హతిభిః కిరాతరీతి రనుమీయతే. కథయ మేత దితి."

క. జందెముల బ్రాహ్మణత్వము, చందంబున బోయతనము శస్త్రాహతిఁ బొ
     ల్పొందఁగ రాచఱికము నీ, యందొక్కట దోఁచుచున్నయది తలపోయన్

ఈపద్యమునందు క్షత్త్రియత్వము క్రొత్తగఁ జేర్పఁబడినది. మాతృకకంటె భావ మీతెలుఁగుచేతలో బాగుగ నున్నది.

“తత్ర హేతిహతికిణాంకం కాలాయసకర్కశకాయం యజ్ఞోపవీతే నామమేయవిప్రభావం వ్యక్తకిరాతప్రభావం లోచనపరుషం కమపి పురుషం దదర్శ."

సీ. నిధిసాధనక్రియానిమ్నోన్నతంబైన ప్రాంతపట్టణమునఁ బాడువోలెఁ
     (గాలాయసముననంగములు గావించినఁ బ్రాణంబు వచ్చిన ప్రతిమవోలెఁ)
     దొండంబు కొమ్ములు దునియ వ్రేటులు వడి కొదపడ్డ యేనుఁగుకొదమవోలె
     డాంబికవిప్రవిడంబనం బొనరింపఁ బూనిన యొఱపిఁడిబోయవోలె
తే. (మేన బోటుగం ట్లెంతయు మిక్కుటముగ)
     నల్లనై తుండువడి (బ్రాహణత్వమునకుఁ
     దావలంబైన వెడజన్నిదములు దాల్చి)
     యున్న యొక్కని గాంచె నమ్మన్నుఱేడు.

ఇందుఁ గుండలీకృత భాగములుమాత్రము మూలానుసారములు. మిగిలిన వన్నియు స్వతంత్రములే.

“పశ్చా న్నిషీదతో౽స్య బాహుదండయుగళ ముభయకరమూల ప్రవేళిత మగ్రే౽వలంబ్య స్వ మంగ మాలింగయామాస స్వయం చ పృష్ఠతోవలితాభ్యాం పర్యవేష్టయత్.”

     “చెలి గౌఁగిలించెఁ దనకేలు పిఱిందికిఁ జాఁచి వేడుకన్”
క. అతనికరంబులు కక్ష, ద్వితయంబున నిగుడఁ దిగిచి వికసితముఖుఁ డై