పుట:దశకుమారచరిత్రము.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

332

దశకుమారచరిత్రము

తే. రాజవాహననృపతి ధర్మమున రాజ్య
     పాలనము చేయునెడఁ బ్రజ పరమసుఖము
     గదిరి ధర యెల్ల శ్రీధాన్యకటక మయ్యె
     నతనికీర్తులు పాల్పొంగినట్లు వెలసె.93
మ. [1](విలసచ్ఛ్రౌతవిధీయమానసరణీవిధ్యుక్తయజ్ఞక్రియా
     కలనాతర్పితదేవతేంద్రముఖదిక్పాలా! గృహీతోజ్జ్వల
     జ్వలనామష్టమదేహభాగ! మతివైశద్యానవద్యాత్మ! ని
     ర్మలవిజ్ఞాన! యనూనవాగ్విభవసామర్థ్యా! కవిగ్రామణీ!.94
క. నవరసభావాలంకృత
     కవితారచనావిధానకల్పనపాండి
     త్యవిశేష! యుభయభాషా
     తివిశారద! బుధవిరాజి! తిక్ నయాజీ!95
మాలిని. సురుచిరచిరకీర్తీ! సుందరాకారమూర్తీ !
     చరితసవనపూర్తీ! సత్సుధీచక్రవర్తీ!
     పరిణతనయవేదా! భాగ్యసమ్మోదా!
     స్థిరతరఘనమోదా! తిక్కనామాత్యవాదా! )96
గద్యము. ఇది సకలసుకవిజనప్రసాదవిభవ విలస దభినవదండి
     నామధేయవిఖ్యాత కేతనార్యప్రణీతం బైన దశకుమార
     చరిత్రంబను మహాకావ్యంబునందు ద్వాదశాశ్వాసము.

దశకుమారచరిత్రము సంపూర్ణము.

  1. సాంప్రదాయసిద్ధముగా వచ్చుచున్న యాశ్వాసాంతపద్యములు శిథిలము లైనందునఁ బూరింపబడినవి.