పుట:దశకుమారచరిత్రము.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశాశ్వాసము

297

     పఱచి తొలంగి యొండుజాడ మరలివచ్చి కొలను సొచ్చి
     వేషోపకరణంబు లడంచి యాయితం బై యుండి.60
మ. సమయం బైన నృపాలుఁ డస్మదుపదేశప్రక్రియం బద్మషం
     డమునం గ్రుంకుట చూచి బిట్టడరి యంటం బట్టి కంఠంబు పా
     దమునం జిక్కఁగ నూఁది [1]యంతఁ దనువున్ ద్వంద్వంబుగాఁ జేసి ప్రా
     ణములం బాసిన మేను బొక్క నిడి యానందంబునం గప్పితిన్.61
వ. ఇట్లు జయసింహుని సమయించి కొలను వెలువడి తదీయాం
     బరభూషణాదులు ధరియించి యల్లన పరిజనంబు లున్నపరి
     సరంబున కరిగి నివ్వటిల్లు దివియలు వెలయించిన.62
ఉ. అచ్చెరుపాటు నొందు హృదయంబులతోఁ బరివార మంతయున్
     వచ్చి కనుంగవల్ విరియ నాకు మహీస్థలిఁ జాఁగి మ్రొక్క నే
     నచ్చట సస్మితాననమునాకృతి వారల నాదరించి వా
     క్రుచ్చి యొకండుఁ బల్కక నిరూఢమహానియముండ పోలె నై.63
చ. నగరికి నేఁగి వాఁడినయనంబుల నందఱ వీడుకొల్పి వా
     సగృహముచొచ్చి యంతిపురిభామలు విస్మితలోచనప్రభల్
     మిగులఁగఁ జూచుచోఁ గనకరేఖఁ గనుంగొని దానితోడఁ ద
     న్పుగ నొకపల్కు పల్కి మునుపొల్తులకుం బుయిలోట పాయఁగన్.64
వ. మనోహరాకారలాభకారణంబునకుం దగినయాలాపంబులం
     గలపికొని కొంత సేపు వారలనడుమ నిలిచితి నట్టియెడం
     గర్దననందన సందేహాందోళితం బైన డెందంబుతోడ నన్ను
     నిరూపించుచుండె నేనును సాభిప్రాయంబులు సవిస్మితం

  1. త్రొక్కి నృపు వీతప్రాణుఁ గా