పుట:దశకుమారచరిత్రము.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

పలేదేమో యన వీలు లేదు. ఏలయన దశకుమారచరిత్రమునఁ దిక్కన యజ్ఞము గావించినటుల షష్ఠ్యంతములందు ఆశ్వాసాంతములందుఁ గృత్యాదిని జెప్పబడినది. ఉత్తరరామాయణము యజ్ఞమునకుఁ బూర్వము రచింపఁబడినపొత్తమని గ్రంథమందలి గద్య కృత్యాది తెలుపును. ఇట్టియెడఁ గేతన దిక్కనసోమయాజిరచితగ్రంథములఁ బేర్కొనమికిఁ గారణము తోచదు. భారతము దశకుమారచరిత్రము గైకొనునప్పటికి రచింపఁబడలేదేమొ గాని నిర్వచనోత్రరామాయణము మాత్ర ముప్పటికి రచయింపఁబడె ననుట కెట్టిసంశయ ముండదు.

"కృతులు రచించిన సుకవుల
  కృతు లొప్ప గొనంగ నొరునికిం దీరునె
...........తిక్కండొకండు దక్కన్.
సీ. లలితనానాకావ్యములఁ జెప్పు నుభయభా
   షలయందు ననుట ప్రశంసత్రోవ.
క. అభినుతుఁడు మనుమభూవిభు
   సభఁ దెనుఁగున సంస్కృతమునఁ జతురుండై తా
   సుభయకవిమిత్రనామము
   త్రిభువనముల నెగడ మంత్రి తిక్కఁడు దాల్చెన్.

అను దశకుమారచరిత్రములోని పద్యములవలన తిక్కన కవుల బహూకరించి కృతులం గొనె నని వివిధగ్రంథములు రచియించె నని, మనుమసిద్ధి యాస్థానమునఁ గవియు మంత్రియునై యుండె నని యుభయకవిమిత్రు డనుబిరుదము దాల్చె నని తెలియును. ఉభయకవిమిత్రబిరుదము భారతరచనమునుండి సుప్రసిద్ధముగఁ దిక్కన వాడుకొనుటచే భారతరచనాకాలమునఁ దిక్కన కృతి తీసికొనెనేమో యని తోఁచెడిని. దశకుమారచరిత్రకృత్యాదివలనఁ దిక్కనసోమయాజి ప్రతిభ రాజనీతి త్యాగగుణము కార్యదక్షత వివిధవిద్యానైపుణ్యము