పుట:దశకుమారచరిత్రము.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొలిపలుకు

దశకుమారచరిత్రము తెనింగించిన కవి కేతన. ఇతఁడు కౌండిన్యసగోత్రుడు. భండారుకేతన బావమఱఁది. మ్రానయ (మారయ) సంకమాంబల కుమారుఁడు. ఇంటిపేరు మూలఘటికవారు. అభినవదండి బిరుదాంకితుఁడు. ఈకవి తనశక్తిసామర్థ్యముల నిటులఁ జెప్పుకొనినాఁడు.—

కవితఁ జెప్పి యుభయకవిమిత్రు మెప్పింప, నరిది బ్రహ్మకైన నతఁడు మెచ్చఁ
బరగ దశకుమారచరితంబుఁ జెప్పిన, ప్రోడ నన్ను వేఱె పొగడ నేల.

దశకుమారచరిత్రము ఉభయకవిమిత్రుడును భారతరచనాధురీణుఁడు నగు తిక్కనసోమయాజి కంకితము గావింపఁబడినది. తిక్కనయంతవాఁడు మెచ్చిన నాకవితయొక్క గొప్పదనము నేను జెప్పుకొనుట పునరుక్తియని కవి చెప్పుచున్నాఁడు. కేతనకవిత రసవంతముగ నిర్దుష్టముగ ధారాశోభితముగ నుండి చదువఁజదువఁ జవులూరుచుండును. ఈకేతనకవి వెంగిదేశమునందలి [1]వెంటిరాలను నగ్రహారమున కధిపతి.

ఆంధ్రభాషలోఁ గవు లంకితమునొందిన పుస్తకములలో దశకుమారచరితము మొట్టమొదటిది. ఇందుఁ గవిరాజగు తిక్కనసోమయాజి గుణగణములు దాతృతాసౌందర్యములు విద్యావివేకములు పండితానురక్తి విపులముగఁ గొండాడఁబడినవి. తాను కవియై కవుల నింతగ గౌరవించినవాఁడు తిక్కనగాక వేఱొకండు ఆంధ్రవాజ్మయమునఁ గానరాఁడు. కాని కేతన తిక్కనసోమయాజి నుభయభాషాకవి యనియు, మయూరసన్నిభమహాకవి యనియుఁ గవిజనరాజకీరసహకార మనియుఁ బేర్కొనెనెగాని ఉత్తరరామాయణాదిగ్రంథములు రచించినటులఁ జెప్ప లేదు. దిక్కనసోమయాజి యప్పటికి గ్రంథరచనము గావిం

  1. పూర్వముద్రితప్రతిలో వెఱ్ఱిరా లని యున్నది.