పుట:దశకుమారచరిత్రము.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

274

దశకుమారచరిత్రము

     వెలిపుత్తు నని కుపితుఁ డై
     బలభద్రుఁడు వరవుఁ బెక్కుపాట్లం బఱచెన్.125
చ. పఱచిన నాగ్రహించి మును పాయక నమ్మిక నున్ననాఁడు తా
     నెఱిఁగినమాట లన్నియును నెగ్గుగ నాత్మఁ దలంచి దాసియున్
     [1]గొఱకొఱ వీట నెల్లెడల గోసన పుచ్చిన నర్థలుబ్ధుఁ డై
     యఱమర మానితద్విభుఁడు నాబలభద్రుని బట్టఁ బంచినన్.126
ఆ. అతనికాంత యైన యారత్నవతి పతి
     కిట్టు లనియె వెఱవ నేల? మనకుఁ
     దెఱఁగు గలదు వసుమతీనాయకునితోడ
     నిట్టు లనుము ధైర్య మెసక మెసఁగ.127
క. వరవుళ్లమాట [2]లొకక్రియఁ
     బరికింపక నిజము సేయఁ బాడియె వలభీ
     పురి గృహగుప్తుం డనియెడి
     వరవైశ్యునిపుత్రి రత్నవతి యిది దీనిన్.128
ఆ. తల్లి దండ్రు లొసఁగఁ దత్కరగ్రహణంబు
     చేసినాఁడ నచటు వాసి యొక్క
     కారణమున వచ్చి చేరితి మిప్పుర
     మధిప! యప్పురమున కరయఁ బనుపు.129
క. అను మని చెప్పిన విస్మయ
     మనస్కుఁ డగు నతనితోడ మఱియును దెలియం
     దనవృత్తాంతం బంతయు
     గనదంబుజనేత్ర చెప్పె గౌరవ మెసఁగన్.130

  1. గొఱుకున
  2. విని యొప్పరికింపక