పుట:దశకుమారచరిత్రము.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

256

దశకుమారచరిత్రము

     సిరి పురాతనుఁడైన పురుషుని మును[1](గూడెఁ
                    జెలువుని గూడ) దీచిగురుఁబోఁడి
     జనులకు నిందిరాసతి పొడచూప దీ
                    పద్మాక్షి కన్నుల పండువయ్యె
     నింత ప్రాయం బని యెఱుఁగము కమల కీ
                    నాతికి నెలజవ్వనం(బు హెచ్చెఁ
తే. గాన) నీలక్షణమ్ములు కమలనిలయ
     లక్షణములకుఁ గడు నగ్గలంబు లిట్టి
     వనితకన్ను మనంబు నెవ్వానిఁ దగిలె
     నతఁడె కాఁడె మన్మథునకు ననుగలంబు.29
క. (అని తలంచుచుండ) వనజా
     నన కందుకకేళియందు నానావిధులం
     దననేర్పు మెఱసి యాడెం
     గనుఁగొనల మెఱుంగు లెల్లకడలం బొలయన్.30
వ. అయ్యవసరంబున.31
క. (చెఱకువిలుకాని) యమ్ముల
     తెఱుఁగున వడిఁ గందుకావతీదృగ్దీప్తుల్
     నెఱ నాటి ధైర్య మంతయుఁ
     బఱిగొని ననుఁ గుసుమబాణు బారిం ద్రోచెన్.32
తే. కందుకక్రీడ దీరిన నిందుము(ఖియుఁ
     జెలులతోఁ) గొంత ప్రొద్దు కోమలవిహార
     లీలఁ జలియించి వేడ్క సాలించి యంబి
     కాభివందన మొనరించి యరుగునపుడు.33

  1. ఈ పద్యములలోని కుండలీకృతభాగములు వ్రాఁతప్రతిలో శిథిలములు.