పుట:దశకుమారచరిత్రము.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

163

     ట్టిదు లై వచ్చుచునున్న యారెకులఁ గంటిం [1]గంటి నేఁడెందు వ
     చ్చెద రంచుం జనఁ జొచ్చి యల్కక కరాసిం గ్రూరచేష్టుండ నై.108
క. కొందఱఁ జంపియుఁ గొందఱ
     జిందఱవందఱలుగాఁగఁ జెడఁ దోలియు ను
     న్నం దొలఁగియున్న యారెకు
     లందఱు నొండొరులఁ గూడి యతివేగమునన్.109
క. పఱతెంచి పట్టి యెమ్ములు
     నెఱచియు నొక్కంతగాఁగ నీడ్చియుఁ బెలుచం
     జఱచియుఁ బొడిచియుఁ దాఁచియు
     గుఱుమూఁకలు గూడఁ గిట్టికొని తమలోనన్.110
వ. మదీయవృత్తాంతంబు సెప్పికొనుచున్నంత.111
క. ఒడ లెఱఁగి విధికృతమునకు
     గడుఁ జోద్యం బంది పూర్వకర్మఫలంబుల్
     గుడువక పో నని చిత్తము
     నొడఁబఱచుచు బ్రతుకునొఱపు లూహించునెడన్.112
వ. రాగమంజరియాప్తపరిచారికయు గూఢకృత్యనిపుణయు
     శంఖసంభాషణయు నగు సృగాలిక యనునది నావెనుక
     వచ్చినం జూచి తత్కాలోచితంబగు నొక్కయుపాయంబు
     గని యది డాయం జనుదెంచిన దానిమొగంబు గనుంగొని
     నీవు పిఱుందన పఱతెంచినదానికిం [2]బే రేమి మత్ప్రాణ
     వల్లభ యగు రాగమంజరితోడ నాకుం గృత్రిమమిత్రుండైన

  1. జేరి యెందెందు
  2. మేలేమి