పుట:దశకుమారచరిత్రము.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

దశకుమారచరిత్రము

మ. సభలో నాకడ కేగుదెంచి నిజదృగ్జాలంబు నీలోత్పల
     ప్రభల న్నింపఁగ [1]మోవి లేనగ విగుర్పన్ నన్ను వీక్షించి మ
     త్సుభగత్వంబు [2]నుతించి సుందరకుఁ దేజోహీనుఁ గావించినన్
     సభికవ్రాతము పిచ్చలించె నను నాసొస్తోత్రవాక్యంబులన్.53
వ. అప్పు డత్యంతరాగాక్రాంతచిత్తుడనైన నన్నుం దన
     యింటికిం దోడ్కొని చని సముచితకరణీయంబులను మదన
     వికారానురూపప్రకారంబులను నాసక్తుం జేసి.54
క. నాయింటి మొల్లమునకును
     నా యొడలికిఁ బ్రాణములకు నావారికిఁ దా
     నాయిక యై (వల) నేర్పడ
     నాయంబుజనేత్ర నన్ను నడగో ల్గొనియెన్.55
క. ధన మంతయుఁ గొని కతిపయ
     దినములలో గోఁచి యిచ్చి ధృతి మాల్చి మడిం
     గనికరము మాలి కోమలి
     వినువారలు గేలిగొనఁగ వెడలం ద్రోచెన్.56
వ. అట్టియెడ.57
క. గురుజనధిక్కరణంబులు
     పురజనపరిహాసవచనములు బంధుజన
     స్ఫురితోల్లాసములు వినఁగ
     విరసము లగుటయు విషాదవేదనతోడన్.58
క. మిండాట మాడి పొలిసిన
     మిండలకును జైనవృత్తి మే లని మదిలో

  1. మేలి
  2. నటించి