పుట:దశకుమారచరిత్రము.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

105

శా. చంపాపట్టణ మేడ్తెఱన్ వెడలి యుత్సాహోగ్రుఁడై శాత్రవుల్
     కంపింపంగ గజంబు నెక్కి యవలీలం బోరిలో గిట్టి సా
     ధింపం జాలుదు నేన వాని నని యుద్రేకించి శుంభచ్చమూ
     సంపద్వైభవ మొల్ల కేఁగె దనయజ్ఞానంబు చేదోడుగన్.84
వ. ఇవ్విధంబున నక్షమాపరిణతుం డై నడచి నగరోపకంఠం
     బునం దలపడి యతిఘోరయుద్ధంబు సేయం జొచ్చిన.85
ఆ. అపుడు చండవర్ముఁ డలిగి యంగాధీశు
     సేన పాఱిన మఱి సింధురంబు
     మీఁదనుండి యతనిమీఁదికి లంఘించి
     పట్టికొనియెఁ జలము బలము మెఱయ.86
ఆ. పట్టి యతనికూర్మిపట్టి నంబాలిక
     నర్థిఁ బెండ్లియాడ నతఁడు దలంచి
     యునికి జేసి చంప నొల్లక బలుచెఱ
     నునిచి సంతసమున నుండి యంత.87
వ. దర్పసారుకడ[1]కుఁ దనవుచ్చిన యెణజెంముం డన జంఘా
     లుండు పఱతెంచి యాజ్ఞాపత్రిక యిచ్చినఁ బుచ్చికొని
     చండవర్ముండు విచ్చి చూచె నందలిపదబంధం బెట్టి
     దనిన.88
సీ. స్వస్తి సమస్తరాజన్యచూడామణి
                    కిరణరంజితపదసరసిజాతుఁ
     డగు దర్పసారధరాధీశుఁ డానతి
                    చండవర్మున కిచ్చె సంతసమునఁ

  1. నుండి తనయొద్ద కేణ