పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

భారతీయులు ఏం చేశారు? -2


చేయకుండా నా మీద మీరు తిన్నగా చర్యతీసుకున్నారు. ఇందుకై మీమీద గాని, మీ కమిటీ మీద గాని నేను కేసు పెట్టదలచలేదు కేసు పెట్టడం ధర్మమే అయినా మీరు చేసిన దానికి కోర్టు ద్వారా మీపై చర్య తీసుకొనేలా చేయడం నాకు యిష్టం లేదు. నేటాలు యంచలి తెల్లవారి లధికారాల్ని రక్షించడం కోసం మీకు ధర్మమని తోచిన విధానాన్ని మీరు అనుసరించారు ఇది రాజకీయ వ్యవహారం నేను కూడా రాజకీయ రంగంలోనే మీతో పోరాటం సాగించవలసి యున్నది బ్రిటిష్ సామ్రాజ్యంలో భారతదేశం పెద్ద భూభాగమని, తెల్లవారికంటే ఎక్కువ జనసంఖ్య గలిగిన దేశమని, కనుక తెల్లవారికేవరికీ ఏవిధమైన నష్టము కలిగించకుండా తన స్వాభిమానాన్ని, అధికారాల్ని మాత్రమే భారతజాతి రక్షించదలుస్తున్నదని స్పష్టం చేయవలసిన అవసరం ఎంతైనా వున్నది" అని చెప్పాను

శ్రీ ఎస్కంబ్ - మీరు చెప్పిన విషయం నాకు అర్థమైంది. నాకు నచ్చింది కూడా మీపై దాడిచేసిన వారిపై కేసు పెట్టడానికి మీరు సిద్ధపడరని నేనూహించి యుండలేదు. మీరు కేసు పెట్టదలచి యుంటే నాకు ఏమాత్రము కోపం వచ్చి యుండేది కాదు. మీరు మీ నిర్ణయం ప్రకటించారు కనుక మీ నిర్ణయం మంచిదని చెప్పడం నా కర్తవ్యమని భావిస్తున్నాను ఇంత సంయమం కలిగిన మీరు మీ జాతికి పెద్ద మేలు చేయగలుగుతారు మీరు యీ నిర్ణయం ద్వారా నేటాలు ప్రభుత్వాన్ని కూడా పెద్ద యిబ్బందినుంచి తప్పించారని చెప్పక తప్పదు. మీరు కోరియుంటే మేము తప్పక తెల్లవారిని నిర్బంధంలోకి తీసుకొని శిక్షించియుండేవాళ్లం. దానితో వాళ్లు పేట్రేగిపోయి రభస చేసేవారు. ఇలా జరిగితే ఏ ప్రభుత్వమూ అంగీకరించదుగదా! ఇది సామాన్య మైనవిషయం కాదు కనుక కేసు పెట్టను అని నిర్ణయానికి మీరు వచ్చి యుంటే ఒక కాగితం మీద ఆ విషయం వ్రాసి నాకు యివ్వండి మనిద్దరిమధ్య జరిగిన సంభాషణ వివరం మాత్రమే మీ. చేంబర్లెస్‌కు వ్రాసి నేను నా ప్రభుత్వానికి రక్షణ కల్పించలేను మీరిచ్చిన పత్రమందలి విషయాన్ని తంతి ద్వారా వారికి తెలియజేస్తాను. మీరు అటువంటి బాబు యిప్పుడే వ్రాసియిమ్మని నేను కోరను మీ మిత్రులతో చర్చించండి మి. లాటిన్‌ గారి సలహాకూడా తీసుకోండి ఆ తరువాతకూడా మీరు మీ