పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

55


చేరాయి ఆ డబ్బుతో సంస్థకోసం సొంతభూమిని కొన్నారు. తద్వారా సంస్థకు మంచి ఆదాయం లభించింది

ఈ వివరాలన్నింటిని కావాలనే నేను పేర్కొన్నాసు యీ వివరాలన్నీ తెలియకపోతే దక్షిణాఫ్రికా భారతీయులు పెద్ద ఉద్యమానికి ఎలా సిద్ధమైనారో, ఎలా ఉద్యమం సాగించారో అర్ధం కావడం కష్టం నేటాల్ కాంగ్రెస్‌కు కలిగిన కష్టాలు ఎన్నోవున్నాయి. ప్రభుత్వాధికారులు ఎన్నిసార్లు ఎన్నోరూపాలలో దానిమీద దాడులు చేశారు. వాటినుంచి అది సురక్షితంగా బయటిపడింది ఇటువంటి విషయాలు చాలా పున్నాయి. కాని వాటిని వివరణ తగ్గించవలసివచ్చింది. అయితే ఒక్క విషయం యిక్కడ చెప్పక తప్పదు భారతజాతి సదా అతిశయోక్తులనుంచి రక్షణ పొందింది. జాతియందలి దోషాల్ని, వాటిని తొలగించుకొనే విధానాల్ని గురించి కృషి జరుగుతూనే వున్నది. తెల్లవాళ్ల ఆరోపణల యందలి సత్యాన్ని తక్షణం అంతా అంగీకరించేవారు. స్వాభిమానాన్ని, స్వాతంత్ర్యాన్ని రక్షించుకుంటూ తెల్లవాళ్లకు అవసరమైన సహాయసహకారాలు అందించుటకు కూడా సంస్థ సిద్ధపడేది అవసరమైన సమాచారం మాత్రమే దక్షిణాఫ్రికా పత్రికలకు విడుదల చేసేవారు. భారతీయుల మీద విచ్చలవిడిగా అనాలోచితంగా చేయబడే ఆరోపణులకు సమాధానాలు వెంటనే ఆయా పత్రికలకు పంపబడుతుండేవి

నేటాల్‌లో నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ వున్నట్లే, ట్రాన్స్‌వాల్‌లో కూడా భారతీయుల సంస్థ ఒకటి ప్రారంభమైంది. ట్రాన్స్‌వాల్‌లోగల ఆ సంస్థ నేటాల్ కాంగ్రెస్‌కు లోబడి లేదు. అది స్వతంత్రంగా పనిచేస్తున్నది. రెండు సంస్థల అభిప్రాయాలలో కూడా కొద్ది తేడా వున్నది. అయితే యిక్కడ ఆ వివరాల్లోకి పోను ఇలాంటిదే ఒక సంస్థ కేప్‌టౌనులో కూడావున్నది నేటాల్ ట్రాన్స్‌వాల్ సంస్థల నియమావళుల ననుసరించి దాని నియమావళిలేదు అయినా మూడు సంస్థల లక్ష్యం ఒక్కటే మూడింటి కార్యక్రమాల పరమావధి ఒక్కటే

1894వ సంవత్సరం గడిచిపోయింది. నేటాల్ కాంగ్రెస్ చరిత్ర యొక్క ఒక సంవత్సరం 1895 మధ్యకాలంలో గడిచిపోయింది. నా వకాల్తా పని