పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

భారతీయులు ఏం చేశారు? -1


భారతీయుల మనోబలం పెరిగింది. సంతోషం కలిగింది. వాళ్లకు ఒక గట్టి నమ్మకం ఏర్పడింది

బయట ఉద్యమంతో పాటు, ఆంతరంగిక సంస్కరణలు జరపాలనే భావం కూడా భారతీయులకు కలిగింది భారతీయుల నడవడి, ఆచార వ్యవహారాలను గురించి దక్షిణాఫ్రికా యందంతట వ్యతిరేక ప్రచారం ముమ్మరంగా సాగుతూ వుండేది. దానికి తెల్లవాళ్లే కారణం భారతీయులు మురికి వాళ్లు లోభులు వ్యాపారం చేసే ఇంట్లోనే వుంటారు. వాళ్ల గృహాలు మురికి కూపాలు గాలి వెలుగు తొంగైనా చూడవు. తమ సుఖాల కోసం, విశ్రాంతి కోసం కూడా డబ్బు ఖర్చుపెట్టరు యిలాంటి మురికివాళ్లతో అసహ్యించుకోవలసిన భారతీయులతో తెల్లవారు ఎలా సయోధ్యతగా వుందగలరు. యిదీ తెల్లవాళ్లు భారతీయుల మీద చేసే ఆరోపణలు యీ ఆరోపణల నుంచి బయటపడవలసిన ఆవశ్యకతను గురించి అందుకు తీసుకోవలసిన చర్యలను గురించి భారతీయులు ఉపన్యాసాలు యివ్వడం ప్రారంభించారు. యీ చర్చలన్నీ మాతృ భాష (గుజరాతీ) లోనే జరిగేవి

దీనివల్ల నేటాల్ జనానికి ఎంతటి రాజకీయ సాంఘిక జ్ఞానం కలిగిందో పాఠకులు ఊహించుకోవచ్చు. నేటాల్ కాంగ్రెస్ ఆధ్వర్యాన గిర్‌మిట్ ప్రధనుంచి ముక్తి పొందిన భారతీయుల బిడ్డలకు అందులోను నేటాల్‌లో పుట్టి ఇంగ్లీషు నేర్చినా సవయువకులకు విద్యా బోధన జరుపుటకు ఒక విద్యా సంస్థ (నేటల్ ఇండియన్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్) స్థాపించారు పేరుకు మాత్రం దానికి కొద్ది చందా నిర్ణయించారు. అలాంటి భారతీయ యువకుల్ని ఒకచోట చేర్చడం, పరస్పర పరిచయాల ద్వారా ప్రేమను పెంచుకోవడం, భారత దేశం అంటే ఎమిటో చెప్పి వారి హృదయాల్లో దేశభక్తిని పెంపొందింపచేయడం సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం స్వతంత్ర భారతీయ వ్యాపారులు కూడా వారిని ప్రేమిస్తున్నారని, వారికి వ్యతిరేకులుకారని బోధ చేయడం, వ్యాపారుల హృదయాలలో కూడా అట్టి భావం నెలకొల్పడం ఆ సంస్థ యొక్క రెండవలక్ష్యం నేటాల్ కాంగ్రెస్ దగ్గర పెద్ద మొత్తాలు