పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/400

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
379
సత్యాగ్రహ చరిత్ర


13 సెప్టెంబరు - సత్యాగ్రహం ప్రారంభమైంది. ప్రభుత్వానికి, గాంధీగారికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ప్రచురించబడ్డాయి.

22 నుంచి 25 అక్టోబరు వరకు నేటాల్ మరియు ట్రాన్స్‌వాలుకు చెందిన అనేక మంది సత్యాగ్రహులైన స్త్రీలు పురుషులు కేకలు బెట్టి, సరిహద్దులు దాటి అరెస్టు అయి జైళ్లకు వెళ్లారు.

16. అక్టోబరు - మూడు పౌండ్ల తల పన్నుకు వ్యతిరేకంగా న్యూకైసల్‌లో ప్రారంభమైన కార్మికుల సమ్మె అంతటా వ్యాపించింది

6 నవంబరు - గాంధీగారు సమ్మెదారులతో కలిసి ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశించారు.

11 నవంబరు - గాంధీగారికి దండీలో 9 మాసాల శిక్ష పడింది

28 నవంబరు - భారత వైస్రాయి అభిభాషణ.

11. డిసెంబరు - కమీషన్ నియమించబడింది

19 డిసెంబరు - గాంధీగారు శ్రీ కేలన్‌బెక్, శ్రీ పోలక్ జైలునుంచి విడుదల అయ్యారు.

16 ఫిబ్రవరి - ఒడంబడిక ప్రకారం జైళ్ల నుంచి సత్యాగ్రహ ఖైదీలందరూ విడుదల అయ్యారు.

18 మార్చి - కమిషన్ రిపోర్టు వెలువడింది.

3 జూన్ - ఇండియన్స్ రిలీఫ్ బిల్లు ప్రచురించబడింది.

30 జూన్ - ప్రభుత్వంతో చివరి ఒడండిక జరిగింది

20. జూలై - 45 సంవత్సరాల వయస్సులో గాంధీగారు కస్తూరిబా మరియు కెలన్‌బెక్ గారల వెంట దక్షిణాఫ్రికాను పూర్తిగా వదిలివెళ్లుటకు నిర్ణయించి ఇంగ్లాండుకు బయలుదేరారు


- సమాప్తం -