పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

378

అనుబంధం - 1


28. సెప్టెంబరు - శ్రీపోలక్ దేశ బహిష్కరణ శిక్షకు గురి అయిన 85 మంది భారతీయ సత్యాగ్రహులతోబాటు డర్బన్ వచ్చారు

16. అక్టోబరు - కీ. శే. నారాయణస్వామి గర్జరూడ్ బురమన్ అను పేరుగల ఓడలో భారతావని నుంచి వస్తూ డేలాగోవాబేలో చనిపోయాడు.

1911

25. ఫిబ్రవరి - యూనియస్ ప్రభుత్వ గెజిట్‌లో ఇమిగ్రేషన్ రిజిస్ట్రేషన్ బిల్లు ప్రచురించబడింది

25. ఏప్రిల్ - ఆ బిల్లు పార్లమెంటులో ఆపివేయబడింది

20. మే - షరతులతో ప్రభుత్వంలో ఒడంబడిక జరిగింది సత్యాగ్రహసంగ్రామం, రెండోసారి వాయిదా పడింది

1913

22 మార్చి - భారతీయుల మతాలమీదదాడి జరిగింది. జస్టీప్ సర్ల్ ఒక తీర్పు యిస్తూ ముస్లిం షరియత్ ప్రకారం పెండ్లి జరిగిన మరియమ్మ వివాహం చట్ట విరుద్ధమైనదని ప్రకటించారు

3 ఏప్రిల్ - కొత్త ఇమిగ్రేషన్‌ బిల్లు యూనియన్ గెజిట్‌లో ప్రకటించారు.

3 మే - జోహాన్స్‌బర్గులో జరిగిన ఒక బహిరంగసభలో సత్యాగ్రహం ప్రారంభించాలని నిర్ణయం జరిగింది. ఆ వారంలోనే భారత స్త్రీల పక్షాన కూడా అలాంటి నిర్ణయమే హోం మినిష్టరుకి పంపబడింది.

24 మే - గాంధీగారు మరియు హోం మినిష్టరు శ్రీ ఫిషర్ మధ్య 30 ఏప్రిల్ నుంచి జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రచురించబడ్డాయి.

7. జూన్ - పైన తెలిపిన ఉత్తర ప్రత్యుత్తరాల తరువాయి భాగం ప్రచురించబడింది.

21. జూన్ - ఇమిగ్రేషన్ ఆక్టుకు బ్రిటిష్ చక్రవర్తి అనుమతి లభించింది.

15. జూలై - క్రొత్త చట్టం నిబంధనలన్నీ యూనియన్ గెజిట్‌లో ప్రకటించబడ్డాయి.

1. . ఆగస్టు - క్రొత్త చట్టం ప్రకారం మూడు అధినివేశ రాజ్యాలలో ఆపీలు బోర్డు ఏర్పడ్డాయి ఆ బోర్డులో ఇమిగ్రేషన్ అధికారికూడా ఒక మెంబరయ్యాడు.