పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

284

టాల్‌స్టాయ్ క్షేత్రం - 3


నేనూ సంతోషించాను. కానీ మా ప్రయోగం వల్ల ఎప్పుడూ పాములను గురించి మాట్లాడుకోవటం మా సంభాషణల్లో భాగమైపోయింది. ఆల్‌బ్రేస్ట్ అనే ఒక బీద జర్మనీ వాణ్ణి బెక్ ఆశ్రమానికి తీసుకు వచ్చారు. అతడు బీదవాడు వికలాంగుడు కూడా. చేతి కర్ర లేకుండా నడవలేనంతగా అతని వెన్ను భాగం పూర్తిగా వంగిపోయింది. కానీ అతని దైర్యానికి అంతులేదు విద్యావంతుడైనందువల్ల జీవితానికి సంబంధించిన సూక్ష్మ ప్రశ్నలల్లో శ్రద్ధ చూపేవాడు. ఆశ్రమంలో అతను కూడా భారతీయుల లాగే కలిసి మెలిసి వుండేవాడు. పాములతో నిర్భయంగా వ్యవహరించటం ఆయనకిష్టం. చిన్న చిన్న పాములను చేతితో పట్టుకుని తీసుకు వచ్చేవాడు అరచేతిలో వుంచుకుని ఆడించేవాడు. ఆశ్రమం చాలా రోజులు నడిచివుంటే యీ జర్మనీ వాసి యొక్క ప్రయోగాల పరిణామాలు తెలిసియుండేవి

ఈ ప్రయోగాల వల్ల పాములంటే మాకున్న భయం తగ్గింది. కానీ పాముల పట్ల భయం బొత్తిగా పోయిందని కానీ, వాటిని చంపటాన్ని నిరోధించే వాళ్ళమనీ దీని అర్థం కాదు. "ఫలానా పని హింసలేదా పాపము అని అనుకోవటం వేరు. దానికి అనుగుణంగా ఆచరించటం వేరు పాములంటే భయం వున్నప్పుడు మనం ప్రాణత్యాగం చేయటానికి తయారుగా లేనప్పుడు ప్రాణభీతి పమయంలో పామును చంపకుండా ఎవ్వరూ వుండరు ఆశ్రమంలో యిలాంటి సంఘటనొకటి జరగటం నాకు గుర్తుంది. అక్కడ పాముల తాకిడి ఎక్కువగా వుండేదని పాఠకులీపాటికి అర్థం చేసుకునే వుంటారనుకుంటాను మేమా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడెవ్వరూ వుండేవారు కాదు. చాలాకాలంగా అది నిర్జన ప్రదేశంగా వుండేది. కెలన్ బెక్ గదిలోనే ఓ రోజు ఒక పాము కనిపించింది. పైగా అది తరమటానికో లేదా పట్టుకోవటానికో వీలులేని స్థలంలో వుంది. ఆశ్రమంలోని విద్యార్థి ఒకడు దాన్ని చూచి నాకు చూపించాడు. దాన్ని చంపేందుకు అనుమతి నిమ్మని అడిగాడు. నా అనుమతి లేకుండానే అతనా పని చేయగలడు కానీ సాధారణంగా నన్ను అడగనిదే అక్కడి విద్యార్థులైనా పెద్దలైనా ఒక అడుగు ముందుకు వేసేవారు కాదు. పామును చంపేందుకు అనుమతించటం