పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

185


మేము ఒకరినొకరం చూచికూడా సలాము చేసుకోకపోవడం గమనించాను అయినా నేను అతడికి సలాము చేశాను. అతడూ తిరిగి సలాం చేశాడు అలవాటు ప్రకారం ఎలా వున్నావని అడిగాను బాగున్నాను అని సమాధానం యిచ్చాడు. అయితే యివాళ అతడి ముఖం మీద ఎప్పటి మాదిరిగా చిరునవ్వు కనబడలేదు. ఆతడి కండ్లలో కోపం తొంగి చూస్తున్నది. మనస్సులో యీ విషయం నమోదు చేసుకున్నాను యివాళ ఏదో జరుగుతుందని నాకు అనిపించింది. నేను ఆఫీసులోకి అడుగు పెట్టాను అధ్యక్షుడు ఈసప్‌మియాఁ యితరమిత్రులు అంతా వచ్చారు. మేమంతా ఏషియాటిక్ ఆఫీసువైపుకు బయలు దేరాము మీర్ ఆలం, అతడి అనుచరులు కూడా మా వెనుకనే బయలు దేరారు

ఏషియాటిక్ ఆఫీసు భవనం బాన్‌బ్రెన్డిస్ స్క్వేర్‌లో వున్నది. అది మా ఆఫీసుకు ఒకమైలు దూరంలో వున్నది. అక్కడికి వెళ్లడానికి ప్రధాన రోడ్ల మీద నడవవలసి వచ్చింది. బాస్ బ్రెన్డిస్ స్క్వేర్ వీధిలో నడుస్తూ మేము మెసర్స్ ఆర్‌నాట్, గిబ్సన్‌హద్దు వదిలాము అక్కడికి ఏషియాటిక్ ఆఫీసు మూడు నిమిషాల్లో చేరుకోవచ్చు. యింతలో మీర్ ఆలం నా ప్రక్కకు వచ్చి ఎక్కడికి వెళుతున్నావు అని నన్ను అడిగాడు పదివ్రేళ్ల ముద్రలు వేసి పత్రం తీసుకోవడానికి వెళుతున్నాను నీవు కూడా వస్తే వేలిముద్రలు వేయనవసరం లేకుండా పత్రం యిస్తారు. నీకు పత్రం యిచ్చిన తరువాత, వేలిముద్రలు వేసినేను పత్రం తీసుకుంటాను అని అన్నాను

చివరి వాక్యం పూర్తిగా పలికానో లేదో యింతలో నా తలకు వెనుకనుంచి లాఠీ దెబ్బ గట్టిగా తగిలింది హేరామ్ అంటూ నేను నేలమీద ఒరిగిపోయాను తరువాత ఏమి జరిగిందో నాకు తెలియదు మీర్‌ఆలం, అతడి అనుచరులు నన్ను లాఠీలతో బాదారు కాలితో తన్నారు. వాటిలో కొన్ని ఈసప్‌మియాకు, తంబినాయుడుకు కూడా తగిలాయి యింతలో గందరగోళం జరిగింది తెల్లవాళ్లు చాలామంది అక్కడికి వచ్చారు. పోలీసులు కూడా వచ్చారు పరాన్లను కస్టడీలోకి తీసుకున్నారు