పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

ఒడంబడికకు వ్యతిరేకత

దగ్గరలోనే శ్రీ జె సి గిబ్సన్ గారఇ ఆఫీసు వున్నది. నన్ను ఎత్తుకొని అక్కడికి తీసుకు వెళ్లారు. కొద్ది సేపటికి నాకు ఒళు తెలిసింది అప్పుడు నేను రివరెండ్ డోక్‌ను నా ముఖం దగ్గర వంగి వుండటం చూచాను మీకు ఎలా వున్నది అని ఆయన అడిగాడు

నేను నవ్వుతూ యిప్పుడు బాగానే వున్నాను. పళ్లలోను, నరాల్లోను నొప్పిగా వున్నది అని చెప్పాను మీర్ ఆలం ఎక్కడ వున్నాడు? అని అడిగాను

అతణ్ణి, అతడి అనుచరుల్ని అరెస్టు చేశారు అని డోక్ చెప్పాడు

వాళ్లు విడుదల కావాలి అని డోక్‌తో అన్నాను డోక్ . ఇదంతా జరుగుతూనే వుంటుంది. మీరు యిక్కడ ఒక అపరిచితుని గృహంలో పడివున్నారు. మీ పెదిమ చీలిపోయింది. పోలీసులు మిమ్ము ఆసుపత్రికి తీసుకువెళతామంటున్నారు. మీరు మా దగ్గరికి వస్తే నేనూ, మిసెస్ డోక్ శక్త్యానుసారం మీకు సేవ చేస్తాం "

నేను . నన్ను మీ యింటికి తీసుకు వెళ్లండి పోలీసులకు నా ధన్యవాదాలు తెలుపండి మీ దగ్గరికి వెళ్లడమే నాకు ఎక్కువ యిష్టమని వారికి చెప్పండి

ఇంతలో ఏషియాటిక్ ఆఫీసు అధికారి శ్రీ చమనీ కూడా వచ్చారు. నన్ను ఒక బండిలో పడుకోబెట్టి, స్మిట్ వీధిలో వున్న పాదరీ శ్రీ డోక్ గారి యింటికి తీసుకు వెళ్లారు. నన్ను పరీక్షించేందుకు ఒక డాక్టర్ని పిలిపించారు. నేను చమనీని, దగ్గరికి పిలిచి మీ ఆఫీసుకు వచ్చి యీ వ్రేళ్లతో ముద్రలు వేసి పత్రం తీసుకోవాలని అనుకున్నాను కాని ఈశ్వరునికి అది యిష్టం లేదు మీరు దయయుంచి వెంటనే వెళ్లి అవసరమైన కాగితాలు పట్టుకు రండి మొదటి పత్రం నాకు యివ్వండి నాకంటే ముందు ఎవ్వరికీ యివ్వరని విశ్వసిస్తున్నాను అని అన్నాను

తొందరేమున్నది? డాక్టరు వస్తారు. మీరు విశ్రాంతి తీసుకోండి తరువాత అంతా చేద్దాం యితరులకు యిచ్చినా మీ పేరు మొదట వ్రాసి వుంచుతాను అని ఆయన అన్నాడు