పుట:తెలుగు వాక్యం.pdf/90

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

76

తెలుగు వాక్యం

కూడా ప్రయోగించవచ్చు. ఆ క్రియలు అనూదిత వ్యవహారంమీద అనువక్త అభిప్రాయాన్ని తెలియజేసేట్టుగానూ ఉండవచ్చు. పై b, c వాక్యాల్లో " " అని శ్రీ శ్రీ విమర్శించాడు, " " అని కుందుర్తి ఉద్ఘాటించాడు, అని చేరిస్తే అనూదితాంశాలమీద వాఖ్యాన ప్రాయంగా ఉంటై.

పై b, c వాక్యాలు ప్రత్యక్షానుకరణాలా ! పరోక్షాను కరణాలా ? అని గుర్తు పట్టటానికి పనికొచ్చే అంశాలేవీ లేవు. ఇంతకు ముందే ఆయా రచనలతో పరిచయం ఉండటం వల్లగాని, అనూదితాంశంలో ఉన్న శబ్ద సంయోజన బిగువుగా ఉండి మిగతా వాక్యభాగంకన్నా భిన్నంగా ఉండటంవల్ల కాని పై వాక్యాలను ప్రత్యక్షాను కరణాలుగా గుర్తుపట్ట గలుగుతున్నాం.

3.31: అనుకృతాంశంలో వక్తృ శ్రోతలను సూచించే పదాలుగాని, ఇతరాంశాలుగాని లేనప్పుడు ప్రత్యక్ష పరోక్షాను కృతుల మధ్య భేదాన్ని గుర్తించటం కష్టం. అనుకృతాంశంలో ఆట్లాంటి పదాలున్నప్పుడు ప్రత్యక్షానుకృతిలో ఉన్న సర్వనామాలు పరోక్షానుకృతిలో కొన్ని మార్పులు పొందుతై . కింది వాక్య సమూహాల్లో అట్లాంటి వాక్యాల్ని గమనించవచ్చు.

(195)

a. (i) నేను నీతో “నేను వస్తాను” అన్నాను →
        నేను నీతో (నేను) వస్తానన్నాను.

   (ii) నేను అతనితో “నేను వస్తాను" అన్నాను →
        నేను అతనితో (నేను) వస్తానన్నాను.

b. (i) నువ్వు నాతో “నువ్వు కొట్టావు" అన్నావు →
        నువ్వు నాతో నేను కొట్టా నన్నావు.

   (ii) నువ్వు అతనితో "నువ్వు కొట్టావు” అన్నావు →
        నువ్వు అతనితో అతను కొట్టాడన్నావు →
        ? నువ్వు అతనితో తను కొట్టా డన్నావు.

c. (1) అతను నాతో "నేను ఉంటాను” అన్నాడు →
        అతను (నాతో) అతను ఉంటా నన్నాడు →
        అతను (నాతో) తను ఉంటానన్నాడు.