అనుకృతి
75
పరోక్షానుకృతి విధిగా భాషాంశమై ఉండాలి. అనుకృతాంశం అనుకరించే భాషలో వ్యక్తీకృతం కావాలి. అనుకృతాంశాన్ని వాక్యపరంగానే వ్యాఖ్యానించాలి. అయితే ఆ వాక్యం సామాన్య, సంక్లిష్ట, సంయుక్త వాక్యాల్లో ఏదైనా కావచ్చు. (సంయుక్త వాక్యాల్లో సంశ్లిష్ట వాక్యాలు, మళ్ళీ వాటిల్లో సామాన్య వాక్యాలు ఇమిడి ఉండవచ్చు.) వాక్యదైర్ఘ్యానికి భాషలో పరిమితిలేదు గనక అనుకృతాంశం అనంతమైన ఏకవాక్యం కావచ్చు. ఏకభాషా, ఏకవాక్య పరిమితి ఉన్నది పరోక్షానుకృతి.
అనుకరణకు భాషలు భిన్న పద్ధతు లవలంబిస్తై. కొన్ని భాషలు అనుకృతాంశానికి ఏమీ చేర్చకుండానే అనుకరిస్తై. కొన్ని భాషల్లో కొన్ని అపదాలు, లేక పదాలు, పదతుల్యాలు అనుసంధించి ప్రయోగించబడతై. మరికొన్నిట్లో పరోక్ష విధిలో మాత్రమే ఏదో అనుకారకం ప్రయోగించి ప్రత్యక్ష విధిలో అట్లాంటిదేమీ లేకుండా ప్రయోగిస్తారు. తెలుగులోనూ, ఇతర భాషల్లోనూ, వచ్యర్థధాతు నిష్పన్నమైన ఒక అవ్యయాన్ని అనుకారకంగా ప్రయోగిస్తారు. తెలుగులో ప్రత్యక్ష పరోక్షానుకృతులు రెండింట్లోనూ అని అనే రూపం ప్రయుక్తమవుతుంది. ఇది అను ధాతువునుంచి నిష్పన్నమైన క్త్వార్థక క్రియతో రూపంలో సమానం. కాని ప్రయోగంలో రెండిటినీ వేరుచెయ్యొచ్చు.
(194) | a. మా పక్కింటావిడ ఉత్తపుణ్యానికి నానామాటలు అని పోయింది. | |
పై వాక్యాల్లో a లో అని అనుకరణంతో వచ్చిన శబ్దంకాదు. 'పక్కింటావిడ' అనే కర్తతో అన్వయించే క్రియ. b లో లిఖితరూపమైన భాషానుకృతి ఉంది. c లో వాగ్రూపమైన భాషానుకృతి ఉంది, a లో అని కి అనకుండా అనే వ్యతిరేక రూపం ఉంది. b, c లలో అని కి ఆట్లాంటి రూపంలేదు..
b, c లలో భాషా వ్యవహారం వ్యక్తమైన రూపభేదాన్ని బట్టి భిన్న క్రియలు ప్రయుక్తమవుతై. అయితే క్రియలు (రాయు< వ్రాయు, అను) కేవల వ్యవహారం వ్యక్తమైన అంశాన్నే తెలియజేస్తున్నై. వ్యక్తమైన తీరును తెలియజేసే క్రియలను