పుట:తెలుగు వాక్యం.pdf/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సామాన్య వాక్యాలు

7


(13)

a. నీకు పిల్లలు ఎంతమంది?
b. ఆమెకు అన్నలు ఇద్దరు.

మరికొన్ని వాక్యాలలో లోపించిన క్రియ అవు. లాగా కనిపిస్తున్నది. అవి సాధారణంగా సంబంధార్థక బోధకాలు.

(14)

a. అతను నాకు తమ్ముడు.
b. ఆమె నాకు మేనత్త.

ఈ వాక్యాలలో కాలబోధతో సంబంధం లేకుండా అవుతాడు, అవుతుంది అనే క్రియలను ప్రయోగించవచ్చు. ఇట్లా ప్రయోగించినపుడు కొంత ఆర్థభేద మున్నట్లు కన్పిస్తుంది. ఉదాహరణకి అతను నాకు తమ్ముడు అవుతాడు అన్నప్పుడు అతను నాకు సొంత తమ్ముడు కాదు , వరసకు తమ్ముడవుతాడు అని అర్థం కావచ్చు. ఇది తెలుగువారి చుట్టరికపు పద్ధతివల్ల ఏర్పడిన అర్థభేదం.

1.18 : మరికొన్ని వాక్యాలలో లోపించిన క్రియ ఇంకో వాక్యం నుంచి నిష్పన్న మయినట్లుగా కన్పిస్తుంది. అప్పుడా లోపించిన క్రియ ఆ వాక్యపు గుప్త నిర్మాణాన్ని బట్టి మాత్రమే. చెప్పగలము.

(15)

a. నాకు కాఫీ అలవాటు.
b. ఈ పాఠం కష్టం.

ఈ పై వాక్యాలలో తాగటం, చదవటం అనే క్రియలు క్రమంగా లోపించి నట్లు గ్రహించగలం.

1.19 : కొన్ని వాక్యాలలో ఆఖ్యాత పదం విధేయనామంగా కనిపించినా, అర్థాన్ని బట్టి క్రియగానే గుర్తించాల్సి ఉంటుంది.

(16)

a. అతను రోజూ మా యింటికి వచ్చేవాడు.
b. ఆమె రోజూ వీణ వాయించేది.

ఈ పై వాక్యాలు పైకి క్రియారహిత వాక్యాలుగా కనిపించినా, వచ్చేవారు, వాయించేది అనే రూపాలు భూతకాలంలో జరిగిన శత్రర్థ వ్యా పారాన్ని సూచిస్తున్నది. అందువల్ల వీటిని క్రియలుగానే గుర్తించాల్సి ఉంటుంది.