94
తెలుగు వాక్యం
ఈ పై వాక్యాల్లో మనుష్యవాచకశబ్దం కర్తగాకాని- అనుభోక్తగా కాని ఉంది. అయినా వ్యాకరణ విరుద్ధాలయినై. ఈవాక్యాల్లో ఓడిపోవు,చిక్కిపోవు, జ్వరంతగ్గు, చనిపోవు అనే వ్యాపారాలు ఆ వాక్యాల కర్త్రనుభోక్తల స్వాధీనంలోలేవు. ఆఖ్యాతాలకు స్వాధీనత, నిరధీనత అనే అంశాలను ప్రతిపాదించాలని ఈ వాక్యాలు నిరూపిస్తున్నై. ఈ స్వాధీనతా నిరథీనతాంశాలు అన్ని క్రియలకు స్థిరంకాదు.
(219) | a. గెరిల్లాలు గెలవాలని ప్రభుత్వ సైనికులు ఓడిపోయారు. | |
ఈ వాక్యంలో ఓడిపోవటం ఇచ్ఛాపూర్వకంగా జరిగింది. ఇచ్ఛాపూర్వకంగా చేసిన వ్యాపారాలన్నీ కర్తృస్వాధీనంలో ఉంటై. కాబట్టి పై వాక్యం వ్యాకరణ సమ్మతమైంది.
3.845 : దీన్నిబట్టి అని తో ఉన్న వాక్యం హేత్వర్థం కావాలంటే పరవాక్యంలో జంగమప్రాణి వాచకశబ్దం కర్త్రనుభోక్తల స్థానంలో ఉంది, ఆఖ్యాతంలో వ్యాపారం ఆ ప్రాణికి స్వాధీనంలో ఉండాలని సూత్రించుకోవచ్చు. కాని ఈ కింది వాక్యం ఇందుకు విరుద్ధంగా కనిపిస్తున్నది.
(220) | a. ఉపన్యాసకులు రాలేదని సభ వాయిదా పడింది. | |
ఈ పై వాక్యంలో సభ ప్రాణివాచక శబ్దంకాదు. అయినా పై వాక్యం ప్రయోగయోగ్యం, వ్యాకరణ సమ్మతం. అయితే 'సభ' దానంతటది వాయిదా పడదు, కర్త ఒకరుండి ఉండాలి. అంటే పై వాక్యాన్ని కర్తృసహిత వాక్యంనుంచి నిష్పన్నం చెయ్యాలి. దాని నిర్మాణం కింది వాక్యంలోలాగా ఉంటుంది.
(220) | b. ఉపన్యాసకులు రాలేదని నిర్వాహకులు సభను వాయిదా వేశారు. | |
3.845 : హేత్వర్ధబోధలో ఇంతవరకు కార్య వాక్యంలో నియమాలను గురించి మాత్రమే గమనించాం. కారణ వాక్యంలో నియమాలనుగూడా కొన్ని గమనించాలి. అందుకు ఈ కింది వాక్యాలను పరిశీలించండి.
?(221) | a. మా అబ్బాయి ఇడ్డెన్లు (తిన్నానని, తిన్నాడని) భోజనం మానేశాడు. | |