పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంపాదకీయం

1971 జనాభాలెక్కల ప్రకారం తెలుగు మాట్లాడే వాళ్ళసంఖ్య 4.3 కోట్లు. తెలుగు భాషకు సుమారు రెండువేల ఏండ్ల చరిత్ర ఉంది. తెలుగులో బహుశా క్రీ. శ. 5, 6 శతాబ్దులకే కావ్య సాహిత్యం ఏర్పడి ఉంటుంది. ఏ భాషలోనైనా మొట్టమొదటిసారిగా సృష్టించిన సాహిత్యంలో ఉన్న బాష సమకాలీన విద్యావంతుల భాషకు అత్యంత సన్నిహితంగా ఉండి ఉంటుంది. నన్నయకాల నికే కావ్యభాష వ్యవహారభాష పరస్పరం దూరమౌతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. కావ్య భాషకు పూర్వకవి రచనలు ఒరవడి అవుతాయి. వాడుకభాష సామాజిక వ్యవస్థలో వచ్చే మార్పులనుబట్టి ప్రజోచ్చారణ పరిణామాలనుబట్టి నియంతగా మారుతూ వస్తుంది. వ్యవహారభాషపై కావ్యభాషా ప్రభావం అన్ని శతాబ్దుల్లోనూ కనిపిస్తుంది. సమకాలీన వ్యవహారభాష ప్రభావం 15 వ శతాబ్దిదాకా కావ్యభాషలో కొద్దిగాను, ఆ తరవాత ఎక్కువగాను కనిపిస్తుంది. ఈ రెండు శాఖల క్రమపరిణామాన్ని పరస్పర సంబంధాన్ని నిరూపించటమే తెలుగుభాషాచరిత్ర లక్ష్యం. అసమగ్రమైనా తెలుగుభాషకు శాస్త్రీయమైన పద్ధతుల్లో రచించిన మొదటి చరిత్ర ఇదే అనటంలో అత్యుక్తిఏమీలేదు. జరిగిన రెండు మూడు దశాబ్దుల్లో వెలువడ్డ పరిశోధనవల్ల ఇది సాధ్యమైంది.

భాషా చరిత్రకు చెందిన ప్రత్యేక విషయాలపై పరిశోధనచేసి నిష్ణాతులైన, పన్నెండు మంది పండితులను ఆహ్వానించి ఈ గ్రంథం కూర్చటం జరిగింది. దీని ప్రణాళిక 1968 లో తయారైనా పుస్తకరూపంలో వెలువడడానికి ఏడేండ్లుపట్టింది. ఈ ప్రయత్నం ఫలించటంలో తోడ్పడ్డ ప్రకరణ రచయితలందరికి నా హృదయపూర్వకాభివందనలు.

ప్రూపులు దిద్దటంలోను, ఒకటి రెండు వ్యాసాలు తిరిగి రాయటంలోను, పదసూచి, ఉపయుక్తగ్రంథపట్టిక . సంకేత వివరణం మొ. వి. తయారు చేయించటంలో నాకు మొదటినుంచీ సహకరించిన మిత్రుడు రంగనాథాచార్యులకు నా కృతజ్ఞత. మాకీ అవకాశం ఇచ్చి తెలుగు దేశానికి మొదటిసారిగా ప్రామాణిక భాషా చరిత్ర అందించటానికి పూనుకొన్న ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీవారిని నేను అభినందిస్తున్నాను. మెత్తగాఒత్తిడిచేస్తూ ఇప్పటికైనా పుస్తకం వెలువడటానికి