Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xi

కావలసిన సంపూర్ణసహకారం ఇచ్చిన ఆకాడమీ కార్యదర్శి శ్రీ దేవులపల్లి రామానుజరావుగారికి మా వినతి.

మా ఆలస్యాన్ని సహించి ముచ్చటగా అచ్చువేసిన శివాజీ ప్రెస్సు వారు ప్రశంసార్హులు.

తెలుగుశాసనభాషలో అనన్యమైన కృషిచేసినవాడు కందప్పచెట్టి. అడిగిన వెంటనే ఈ గ్రంథానికి రెండు వ్యాసాలు పంపించాడు. పాపం ! అనుకోకుండా అకాలమరణం సంభవించింది. తెలుగుభాషా శాస్త్రాధ్యయనానికి తెలుగుదేశానికి అతని మృతి తీరని నష్టం. అతని దివ్యస్మృతికి ఈ సంకలనం అంకితం చేస్తున్నాము.

ఈ గ్రంథంలో వచ్చిన. చిన్న చిన్న పొరపాట్లను, తప్పులను పునర్ముద్రణలో దిద్దుకోగలమని పాఠకులకు మనవి చేసుకొంటున్నాను.


-భ. కృ