పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

vi

ఈ గ్రంథంలో కనిపిస్తున్నది. మొత్తంమీద ఈ గ్రంథం సమగ్రమైన, ప్రామాణికమైన తెలుగుభాషాచరిత్ర లేని లోటును తీరుస్తున్నదని నమ్మకము. తెలుగును. ప్రధానవిషయంగా అధ్యయనం చేసే విద్యార్థులకే కాక, అంతకంటె ఎక్కువగా తెలుగుభాషపై పరిశోధనలు చేసే పండితులకు గూడా ఇది సహాయకగ్రంథంగా ఉపకరించగలదని ఆశిస్తున్నాము.

కోరినంతనే ఈ గ్రంథానికి సంపాదకత్వం వహించటానికి అంగీకరించి, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, కొంత ఆలస్యమే అయినా గ్రంథాన్ని సమగ్రంగా వెలువరించిన ఉస్మానియా విశ్వవిద్యాలయ భాషాశాస్త్రశాఖాధ్యక్షులు భద్రిరాజు కృష్ణమూర్తిగారికి, ఆయా అధ్యాయాలను రచించిన వ్యాసకర్తలకు, సంపాదక సహాయకులకు సాహిత్య అకాడమీ పక్షాన కృతజ్ఞతలు.


హైదరాబాదు

దేవులపల్లి రామానుజరావు

2-9-75

కార్యదర్శి