పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొలిపలుకు

(రెండవ ముద్రణము)

డా. భద్రిరాజు కృష్ణమూర్తిగారి సంపాదకత్వాన వెలువడిన ఈ 'తెలుగు భాషాచరిత్ర' మొదటి ముద్రణకు సంబంధించిన ప్రతులన్నీ సంవత్సరంలోనే చెల్లిపోయి ద్వితీయ ముద్రణావశ్యకత ఏర్పడినది. దీనివలన ఈ గ్రంథం ఆవశ్యకత స్పష్టంగా తెలుస్తున్నది. అన్ని విశ్వవిద్యాలయాల్లోని తెలుగు ఎమ్. ఏ. పరీక్షలకు ఇది పాఠ్యగ్రంథంగా ఉన్నది. ఈ విధంగా ఈ గ్రంథం ఆధ్యాపకుల, విద్యార్థుల అవసరాన్ని తీర్చగలిగినందుకు ఆంధ్రప్రదేశ్ సాహిత్యఅకాడమీ సంతోషిస్తున్నది.

ఈ ద్వితీయ ముద్రణలో ఆయా ప్రకరణాల రచయితలు అనేకమైన మార్పులు, చేర్పులు చేసినారు. ఒకరిద్దరు తమ ప్రకరణలను నూతన పరిశోధితాంశాలు ఆధారంగా పూర్తిగా తిరిగి వ్రాసినారు. కాబట్టి మొదటి ముద్రణ తరువాత జరిగిన పరిశోధనా ఫలితాలుకూడా చేరటంవల్ల ఇది మరింత ఉపయోగకారి కాగలదని చెప్పవచ్చును. ఆ యా ప్రకరణాల రచయితలందరికీ అకాడమీ పక్షాన కృతజ్ఞతలు. త్వరలోనే ఈ గ్రంథం ఆంగ్లంలో కూడా వెలువడనున్నది.

ఈ గ్రంథాన్ని రెండవ ముద్రణకుగాను సవరించి అందించిన సంపాదకులు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారికి కృతజ్ఞతలు. ప్రూపులు చూడడం మొదలుకొని ఈ గ్రంథం ముద్రణలో అన్నివిధాల సహకరించిన డా. కె. కె. రంగనాథాచార్యులుగారికి, ముద్రణను నిర్వహించిన శివాజీప్రెస్ వారికి అకాడమీ పక్షానకృతజ్ఞతలు.

హైదరాబాదు

28 - 1 - 1979

దేవులపల్లి రామానుజరావు

కార్యదర్శి