Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/445

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

430 తెలుగు భాషా చరిత్ర

(7) లక్ష్యార్థప్రయోగాలు (metaphorical usage): తెలుగు పదాలనేకం వాచ్యార్థంలోనేగాక లక్ష్యార్థంలోను కార్యకారణ, ఉపమానోపమేయ, అంగాంగి, ఆధారాధేయాది సంబంధాన్ని బట్టి రూఢిలో ఉన్నాయి. తీపిమాట, వాడిచూపు, ముష్టివాడు, రాతిగుండె, మొదలైన బంధాల్లోని పూర్వపదం, రంపం పళ్ళు, మంచంకాలు మొదలైన పదాల్లోని రెండో పదం దీనికి ఉదాహరణాలు. అర్థ భేదాన్ని బట్టి లక్ష్యార్థ ప్రయోగాల్ని మరి కొన్ని రకాలుగా వర్గీకరించవచ్చు.


(8) జాతీయాలు (idioms) : పదాలకున్న సహజార్థాన్ని మరుగు పరచి విలక్షణమైన అర్థంలో ప్రయోగించబడే పదాలు లేదా పదబంధాలు జాతీయాలు, ఉదా. శిలాక్షరాలు, అందెవేసినచేయి, టోపీవేయు, కొండెక్కు, నిండుకొను, కనుమూయు, శ్రీకారంచుట్టు, నాందిపలుకు, కుంభకోణం, మొదలైనవి.

(9) అనేకార్థపదాలు (polynyms): ఏ భాషలోనైనాసరే కేవల ఏకార్థ పదాలు మృగ్యమే అని చెప్పాలి. ఒకపదానికి మౌలికమైన అర్థంతోపాటు లక్ష్యార్థంవల్ల లేదా అర్థవ్యాప్తి వల్ల అనేకపదాలు ఏర్పడడం జరుగుతుంది. చారిత్ర కంగా తగిన ఆధారాలున్నప్పుడు ఒకదానికి కలిగే అనేకార్థాలను గుర్తించవచ్చు. వివరాణాత్మక దృష్టితో పరిశీలించినప్పు ప్రతిమాటకు బహుళార్థకత్వం సామాన్య లక్షణంగానే తోస్తుంది. 'మాట' అనేపదానికి బ్రౌణ్య తెలుగునిఘంటువు (1852)లో గ్రంథస్థమైన అర్థాలు, ప్రయోగాలు చూడండి.

మాట n. s. A word, promise: opinion, slander, rumour, నీమాట చెప్పలేదు. He did not speake of you, he did not mention you. ఇది వేరేమాట This is another affair, another thing. వానిమాట కాదు. This is not about him, I am not talking about him, nor him. గడియకు ఒకమాట చెప్పినాడు. He changed his mind every hour. మంచి మాట (interj) Very well : మంచిమాట లాడితే విన్నారు. On speaking them fair they consented, దానిమాటయేల ? Why do you speak of her ? why make mention of it ? దాన్ని గురించి రెండో మాటలేదు. There is no alternative. వారివద్దమాటలు పడ్డాడు he was reproached ro reprimanded by them. In some phrases the word మాట need not be translated ; as ఆమె తిరుగా వస్తున్నదనేమాట తెలిసి