పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/444

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అర్థపరిణామం 429

ఎడు>గంపెడు, ఆట+కత్తె> ఆటకత్తె, దొంగ+తనం > దొంగతనం, కుట్ర + దారు > కుట్రదారు.

(4) సమాసాలు (compounds): అర్థవంతమైన పదాలు రెండుమూడు చేరి ఏకపదంగా వ్యవహరింపబడేవి సమాసాలు. మౌలికపదాల కూర్పుతో ఏర్పడే పదబంథాలవల్ల వివిధార్థ బోధనసమర్థమైన పదజాలం భాషలో ఏర్పడుతుంది. సమాస నిర్మాణ విధానం వివిధభాషల్లో వివిధరకాలుగా ఉండవచ్చు. సమసాలను ముఖ్యంగా మూడురకాలుగా వర్గీకరించవచ్చు. (a) ద్వంద్వ సమాసాలు (coor- dinate constructions), ఉదా. కూరగాయలు, అక్కాచెల్లెళ్ళు, భార్యాబిడ్డలు, పడుగుంబేక (లు) (నేతలో పొడుగు, అడ్డం), మొదలైనవి. 4) కర్మాధారయ సమాసాలు (endo-centric constructions), ఉదా. అగ్గిపెట్టె, ఇనుపగొట్టం గళ్శచీర, దిష్టిబొమ్మ, ఇస్త్రీ పెట్టె, నవురుచాలు (పొలాన్ని మూడోసారి దున్నడం), తలకాల్వ (పెద్దకాలవ) ఎర్రబక్క తెగులు (పైర్లకు వచ్చే ఒకరకం తెగులు), ఆసుకోలకర్ర మొదలైనవి. నిర్మాణసాదృశ్యం ఉన్నప్పటికీ నిగూఢమైన అర్థ భేదాలను బట్టి తెలుగు కర్మధారయ సమాసాలను ఎన్నో అవాంతర భేదాలుగా వర్గీకరించవచ్చును. (C) బహువ్రీహిసమాసాలు ( exo-centric construc- tions): సమాసగత పదాల మౌలికార్థానికి పూర్తిగా భిన్నమైన అర్థాన్ని తెలిపే పదబంధాలు ఇవి. ఉదాహరణకు కాకిముక్కులు, రెడ్డిసాని కాటికెలు (వడ్లల్లో రకాలు), గొల్లకావిడి (ఆరుద్రానక్షత్రం), పిల్లలకోడి (కృత్తికానక్షత్రం), కోడి జుట్టు (అలంకారానికి పెంచే ఒకరకం మొక్క), పైడికంటి (గుడ్లగూబ జాతికి చెందిన చిన్న పక్షి) మొదలైనవి.

(5) శబ్దపల్లవాలు (idioms, compound verbs): ధాత్వాదులకు ధాతువులు చేరి విలక్షణమైన అర్థాన్ని బోధించేరూపాలు శబ్దపల్లవాలు, ఉదా. తలపోయు, తల పెట్టు, నిలబడు, దయచేయు, కూర్చొను, మేల్కొను, ఎక్కు పెట్టు వాపోవు, మొదలైనవి.

(6) ఆమ్రేడితరూపాలు: (reduplication): ఒక పదాన్ని అవ్యవ హితంగా పునరుక్తి చేసినందువల్ల విశిష్టార్థం సిద్ధించవచ్చు, ఉదా. 'ప్రతి' అనే అర్థంలో ఊరూరు, ఇల్లిల్లు, వాడవాడ, వీధివీధి, మొదలైనవి; వచ్చి వచ్చి, చూసి చూసి, ఎగిరెగిరి, ఇటువంటి క్వార్థకామ్రేడిత రూపాలు; ముక్కలు ముక్కలు, పొడిపొడి, మొదలైన పునరుక్తి రూపాలు విశిష్టార్థంలో ప్రయోగింపబడుతున్నాయి.