పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆధునికభాష : సంగ్రహవర్ణనం 371

చూపించదగిన ఉదంతమైన రెండు మాత్రం (రెండు హ్రస్వాచ్చుల) నామాలే కనపడటంటేదు. అంటే 'ఉ'లోపం సందేహాస్పదమైన పై శబ్దాలతోపోల్చి చూడటానికి స్వతస్పిద్ధంగా ఉదంతమైన రెండు మాత్రల శబ్దాలు కనిపించటం లేదని.

15. తత్సమ శబ్దాల్లో మహద్వాచక 'డు'వర్ణకం లోపిస్తుంది. ఉదా. స్నేహితుడు + లు > స్నేహితులు, పండితుడు + లు > పండితులు. కొందరి వ్యవహారంలో ఈ కార్యం దేశ్యశబ్దాల్లోనూ కనిపిస్తుంది ఉదా : తమ్ముడు + లు > తమ్ములు.

16. అకార, ఎకార పూర్వకమైన 'మ' కారాంతశబ్దాలో తుదిమకారానికి లోపం పూర్వస్వరానికి దీర్ఘమూ వస్తాయి. చివరి మకారాన్ని స్వరయుతంగా గ్రహిస్తే స్వరానికికూడా లోపం జరుగుతుంది. ఉదా. గుర్రం +-లు > గుర్రాలు, కళ్ళెం + లు > కళ్ళేలు. ఎకారానికి వివృతిమొదటే ఉంది. దీర్ఘమైనప్పుడు ఈ వివృతి అధికమవుతుంది.

17. ఎద్దు శబ్దానికి బహువచనంలో 'ఎడ్డు' అనే రూపం వికల్పంగా ఏర్పడ్డ 'ఎడ్లు' రూపం ఏర్పడుతుంది.

18. పెండ్లి, రాత్రి శబ్దాలకు క్రమంగా పెండ్లి౦డ్లు, పెళ్ళిళ్ళు; రాత్రి౦డ్లు, రాత్రిళ్ళు అనే బహువచన రూపాలున్నాయి.

19. సర్వనామాలకు ఏకవచన బహువచన రూపాలీకిందివిధంగా ఉంటాయి: నేను-మేము, మనం; నీవు, నువ్వు-మీరు; అతను, ఆయన, వాడు- వారు; ఆమె-వాళ్ళు.

20. విశేషనామాల (proper noun) ను కూడా సామాన్య నామాలు (common nouns) గా వాడినప్పుడు 'లు' వర్ణకంతో బహువచన నామాలుగా వాడవచ్చు. ఉదా : రామారావులు, కృష్ణమూర్తులు.

13.8. ఔపవిభక్తికాలు : నామాలు విభక్తులముందు, విభక్తర్థ్యక శబ్దాలముందు. ఇతర నామాలముందు ప్రయోగించినప్పుడు సమాసాల్లోను కొన్ని మార్పులకు గురిఅవుతాయి. వీటిలో కొన్నింటిని సాంప్రదాయికంగా ఔపవిభక్తికాలంటారు.