పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

370 తెలుగు భాషా చరిత్ర

రూపాన్ని సాధించుకోవాలి. తెలంగాణంలో 'ణి' అనే ఏకవచనరూపం ఉంది. దీని నుంచి బహువచనం సాధించాలంటే స్వరలోపం తర్వాత డ కారంగమం చెప్పుకోవాలి. కాణి + లు > కాణ్ + లు > కాణ్ + డ్ + లు > కాండ్లు. (13.5 వర్ణసంయోజననియమావళిలో 10వ నియమంలో 'డ' కారాగమంతో సామ్యం గమనించండి).

12. యకారేతర వ్యంజన పూర్వకమైన నామాంత ఇ వర్ణం ఉవర్ణంగా మారుతుంది. ఉదా: గది+లు>గదులు, కాకి + లు>కాకులు. కాని పొయ్యి + లు > పొయ్యిలు.

13. దంతమూలీయ ముర్ధన్యేతరపరకమైన నడిమి 'ఇ' (చివరి అచ్చుకు ముందటి అచ్చు) మూడక్షరాలమాటల్లో 'ఉ' గా మారుతుంది. చతుర్మాత్రాక శబ్దాల్లో ఈ మార్పు జరగదు. ఉదా : ములికి+లు > ములుకులు, అడివి + లు < అడువులు, కాని ఆవిరులు, ఊపిరులు, కావిళ్ళ, వేవిళ్ళు, పిడికిళ్ళు.

మాత్రాసంఖ్య బదులు ఇక్కడ కూడా దంతమూలీయ మూర్ధన్య వ్యంజనాలే ఈ మార్పును నిరోధిన్తున్నాయనవచ్చు.

ఈ మార్చు తత్సమశబ్దాల్లో జరగదు. ఉదా : అతిథి+లు > అతిథులు, సమితి + లు > సమితులు, సముతులు అని వ్యవహరించేవారికి 'సమితి' తద్భవం.

14. నామాంతంలోని 'ఉ' మూర్ధన్యవర్ణ పూర్వకమైతే లోపిస్తుంది. ఉదా : చెట్టు+లు > చెట్లు, కోటు+లు > కోట్లు, పండు+లు > పండ్లు. ఈ స్వర లోపం జరిగిన తరవాత ఇంకో వ్యంజనం ముందటి ద్విరుక్త వ్యంజన౦ అద్విరుక్త మవుతుంది.

ఇదంత నామాల్లో పూర్వ సూత్రంవల్ల చివరి 'ఇ' 'ఉ' గా మారుతుంది. అది కూడా ఈ సూత్రం వల్ల లోపిస్తుంది. దడి-దళ్లు, బడి-బళ్లు, బండి-బండ్లు, కోడి-కోళ్లు మొ. *బండులు, *కోడులు అనే రూపాలు *పండులు, *కోటులు అనే రూపాల్లాగే అసాధువులు. బడులు, దడులు అనే రూపాలు కూడా అసాధువులే అనుకుంటాను. కాని గుడులు, మడులు అనే బహువచన రూపాలు పూర్తిగా అసాధువులని నిర్ణయించటం సులభంకాదు. ఈ రకమైన అపవాదాలు (ఇవి నిజంగా అపవాదాలయితే) ద్విమాత్రాక శబ్దాల్లోనే కనిపించటం విశేషం. వచన భేదం