తెలుగులో అన్యదేశ్యాలు
333
14. ఫ కొన్నిచోట్ల పగామారుతుంది. ఉదా: ఉ. ఫకీర్, తె. పకీరు ప. ఫర్జ్, తె. పద్దు. మెకంజీ రాతప్రతుల్లో 'పకీరు'కు “ఫకీర్' అనే రూపాంతంరం కూడా కనిపిస్తుంది. బహుశా మామూలుతెలుగులో 'ఫ' లేని కారణంగా అది సమీపధ్వని అయిన ఫగా మారిఉంటుంది. తరువాత అది అల్పప్రాణం అయి ఉంటుంది. ఉర్దూభాషాజ్ఞానం బాగా ఉన్నవారి ఉచ్చరణలో ఫ అలాగే నిలిచి ఉంది.
15. పదాది హకారం కొన్ని పదాల్లో అలాగే నిలిచి ఉండగా, కొన్ని పదాల్లో లోపిస్తుంది. ఉదా: ఉ హజారామ్, తె. హజారము; ఉ. హవల్దార్, తె. హవాల్‌దారు; ఉ. హవేలీ; తె. హవేలి ఉ. హుషారు; తె. ఉషారు; ఉ. హమామ్‌ఖానా, తె. అమామ్‌ఖానా. పదమధ్యంలోని హకారంలో కింద చెప్పిన ధ్వని పరిణామాలు కనబడతాయి.
అ. సంయక్తాక్షరంలో మొదటిహల్లు 'హ' అయినట్లయితే, అది దానికి పరంగా వచ్చిన హల్లులతో సమీకరణం చెందుతుంది. లేదా లోపించి దాని పూర్వ స్వరం దీర్ఘమౌతుంది. ఉదా: ఉ. షహ్నాయి, తె. సన్నాయి; ఉ. ప్రహా, తె. పారా, పహరా.
ఆ. హకారం సంయుక్తాక్షరంలో రెండవహల్లు అయినట్లయితే లోపిస్తుంది. ఉదా: ఉ. సర్హంగ్, తె. సరంగు.
ఇ. హకారానికి 'ఇ' పరంగా వస్తే 'హ' లోపిస్తుంది. ఉదా: ఉ. సిపాహి, తె. సిపాయి; ఉ. కాహిలా, తె. కాయిలా.
11. 6. పర్షియన్, ఉర్జూభాషలనుంచి తెలులోకి వచ్చిన పదాలవల్ల తెలుగు వర్ణాలవ్యాప్తి (distribution) లో కూడా మార్పువచ్చింది. తెలుగు అనునాసికాలైన [మ] [న] [ణ] లు స్పర్శాలకు పూర్వం పరిపూరకప్రవృత్తిలో ఉంటాయి. అంటే ఓష్ట్యాలకు ముందు ఓష్ట్యంగాను, మూర్ధన్యాలకు ముందు మూర్ధన్యం గాను అనునాసికం వినిపిస్తుంది. ఉర్డూలో 'మ, న' అనేవి రెండే అనునాసికాలున్నాయి. అవి అన్ని పరిసరాలలోనూ వస్తాయి. అంటే మ,న లు స్పర్శాలకు ముందు కూడా భేదిస్తాయి. ఉర్దూమాటలైన చమ్కీ , చిష్టూ, చమ్డా మొదలైన పదాలు తెలుగులోకి రావడంతో [మ] వ్యాప్తిలో మార్పువచ్చింది. కాని తెలుగులోని వర్ణనిర్మాణానికి అనుగుణంగా స్వరభక్తి వల్ల 'చమడా, చిమటా, చమికి' మొదలైన రూపాలుకూడా కొన్ని మాండలికాలలో కనిపిస్తున్నాయి.