పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

332

తెలుగు భాషా చరిత్ర

7. పదమధ్యంలోకూడా క > ఖ లేక క > క మార్పులు కనిపిస్తాయి. ఉదా. అ. మకాం, తె. మకాం 'అగటం"; అ. తన్‌కీ, తె. తనఖా 'నిర్ణయం' ; అ. ముక్ రర్‌ ; తె. మొకర్రరు, మొఖరరు, 'నియనించు'.

పదమధ్యంలో క, ఖలతో రూపాంతరాలు కనబెడటాన్నిబట్టి క > కతో కూడిన పదాలే సరియైనవని, పైన (11.5,5) చూపిన ఉదాహరణలలో 'ఖ' లేఖక దోషం అయి ఉంటుందని ఊహించవచ్చు.

8. ఉర్జూలోని సాప్తపథీనోష్మం (x) తెలుగులో మహాప్రాణ హనుమూలీయ శ్వాసస్పర్శం [ఖ ] గా మారుతుంది. ఉదా: ప ఖరీద్‌, తె. ఖరీదు; ప. ఖర్చ్‌, తె. ఖర్చు; ఆ. ఖరాబ్‌, తె. ఖరాబు; అ. ఖాలీ, తె. ఖాళీ.

పదమధ్యంలోకూడా ఈ మార్పు కనిపిస్తుంది. ఉదా: ప. దాఖిలా, తె. దాఖలా; అ ఆఖిర్‌, తె. ఆఖరు

9. ఖ > క మార్పులుకూడా కొన్ని పదాల్లో కనిపిస్తుంరి. ఉదా: అ ఖబర్‌, తె. కబురు; ఆ తారీఖ్, తా. తారీకు.

10. ఉర్జూలోని మహాప్రాణ హనుమూలీయం [ఖ] అల్పప్రాణం అవుతుంది. ఉదా. ఉ. ఖండియా, తె. కండువా.

11. సాప్తపథీననాదోష్మధ్వని [గ] తెలుగులో హనుమూలీయ నాదస్పర్శం[గ] గా మారుతుంది. ఉదా : ఉ. గ్రరీట్క్‌ తె, గరీబ్‌ ; ఉ. గ్గులామ్‌, తె. గులాము.

12. ఉర్జూలోని హనుమూలీయ నాదమహాప్రాణస్పర్శం [ఘ] తెలుగులో కొన్ని పదాలలో అదే విధంగా ఉంటుంది; కొన్ని పదాలలో అల్పప్రాణంగా మార్పు చెందుతుంది. అంటే వ్యవహారంలో ప్రయోగం (functional load) తక్కువగా ఉండే పదాలలో మార్పులేకపోవటం, ప్రయోగం ఎక్కువగా ఉండే పదాలలో మార్పు కలగటం జరిగి ఉండవచ్చు. ఉదా: ఉ. ఘరానా; తె. మరానా; ఉ. ఘాాబ్రా, తె. గాబరా.

13. ఉర్దూలోని దంతోష్ట్యశ్వాసోష్మం ఫ [f] తెలుగులో కొన్నిచోట్ల అలాగే కనిపిస్తుంది. ఉదా : ఉ. ఫర్మానా, తె. ఫర్మానా, ఉ. ఫసల్‌; తె. ఫసల్‌; ఉ. ఫిర్యాద్‌, ఫిర్యాదు.