ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ధ్వనులు
2.1 తె. అ < * అ
- తె. అక్క : త. అక్కా, మ. క. తు. అక్క (24)
- తె. కన్ను : త. మ. కణ్, కో. గో. గోం. కన్ (973)
- తె. పల్లు : త. మ. కోత. క. కో. గోం. పల్ (3288)
2.2 తె. ఆ < * ఆ
- తె. ఆవు : త. మ. ఆ, అవ్, క. ఆ, ఆవు. (233)
- తె. కాలు : త. మ, కోత, క. కో. గోం. కాల్ (1238)
- తె. పాట : త. మ. పాట్టు, కోత పాట్, క. పాట (3348)
2.3 తె. ఇ < * ఇ
- తె ఇల్లు : త. మ. ఇల్, కొం. ఇలు, కూ. ఇడు (420)
- తె. చిన్న : త. మ. క. చిన్న (2135)
- తె విల్లు : త. మ. విల్, క. బిల్, కో, ప. గోం. విల్, బ్రా. బిల్ (4449)
2.4 తె. ఈ < * ఈ
- తె. ఈఁగ : త. ఈ, మ. ఈచ్చు, కోత ఈవ్, కో, నా. నీంగ్ (453)
- తె. చీము : త. చీ, చీఱ్. క. కీము, కీవు, కూ. సివెండి, బ్రా. కీష్ (1337)
- తె. నీరు : త. మ. కోత, తొ. క. నీర్, కో. నా. ఈర్, బ్రా. దీర్ (3057)
2.5 తె. ఉ < * ఉ
- తె. ఉల్లి : త. మ. క. తు. ఉళ్ళి (605)
- తె. గుడి : త. మ. కుటి 'ఇల్లు', క. తు. గుడి (1379)
- తె. పురుగు : త. మ. క. పుఱు, గోం. పుడి, కో. నా. పుర్రె (3537)