పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణం 2

తెలుగు : మిగిలిన ద్రావిడ భాషలు

పి. ఎస్. సుబ్రహ్మణ్యం


     2.0. తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది. ద్రావిడ భాషా కుటుంలో 1. తమిళం (త.), 2. మళయాళం (మ.), 3. కోత, 4. తొద (తో), 5. తొడగు(కొ.). 6. కన్నడం (క.), (మాండలికం :బడగ), 7. తుళు (తు). 8. తెలుగు (తె.), 9. గోండీ (గోం) (మాండలికం : కోయ), 10. కొండ (లేక) కూబీ (కొం.), 11. పెంగొ (సం.), 12. మండ (మం.) 18. కూయి (కూ.). 14. కువి (కువి), 15. కోలామీ (కో.) (మాండలికం : నాయక్డి,) 19. నాయకీ (నా), 17. పర్డీ (ప.), 18. గదబ (గ.) (ఒల్లారీ, సాలూరు మాండలికాలు), 18. కూడుఖ్ (కూ.), 20. మాల్తో (మా.), 21. బ్రాహుయీ (బ్రా.) అనే ఈ ఇరవై యొక్క భాషలు ఉన్నట్లు ప్రస్తుతం లెక్కల ప్రకారం తేలింది. వీటిలో తమిళం నుంచి తుళుదాకా ఉన్న భాషల్ని ఒక ఉపభాషా కుటుంబంగానూ (దక్షిణ ద్రావిడం), తెలుగు నించి గదబదాకా ఉన్న భాషల్ని మరొక ఉపభాషా కుటుంబంగానూ (మధ్య ద్రావిడం) కూడుఖ్, మాల్తో, బ్రాహుయీ అనే మూడు భాషలూ ఇంకొక ఉపభాషా కుటుంబంగానూ (ఉత్తర ద్రావిడం) పరిగణించవచ్చు. (నీలగిరులలో ఉన్న ఇరుళ, కురుంబ జాతుల వారీ భాషల్నీ, కర్ణాటకంలో దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న కొరగజాతివారి భాషనీ కొందరు పండితులు ప్రత్యేకభాషలుగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం వీటి మీద పరిశోధన పూర్తి కాలేదు.) తెలుగులో ధ్వనులు, వ్యాకరణ నిర్మాణం మిగిలిన ద్రావిడ భాషలతో పోల్చిచూస్తే తెలుగు మధ్య ద్రావిడ భాష అనీ, దానికి మధ్య ద్రావిడ భాషలైన గోండి, కొండ, పెంగొ, మండ, కూయి, కువి భాషలతో అతి సన్నిహిత సంబంధం ఉందని స్పష్టమవుతుంది. తెలుగు మధ్య ద్రావిడోపకుటుంబానికి చెందినదని మొదట చెప్పినవారు భద్రిరాజు కృష్ణమూర్తి 1981, ఆధ్యాయం 4). మూలద్రావిడ భాష (మూ. ద్రా.) కాలంనించి తెలుగు ఎలా పరిణామం చెందిందో ఈ క్రిందస్థూలంగా చర్చిద్దాం. (కుండలీకరణాల్లో ఇచ్చిన సంఖ్యలు DED లోని ఆరోపాల్ని సూచిస్తాయి.)