Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

198 తెలుగు భాషా చరిత్ర

ఉదా. నడుస్తూ (<నడుచ్‌-తూ) (NI 3 ఒంగోలు 102.15,1762). (3) అ-తో మొదలయ్యే ప్రత్యయాలకు ముందూ, విద్యర్థక ప్రత్యయం ఉ- ( ∞ ɸ ) కు ముందు -ఇంచ్‌లోని -చ్‌ -వ్ కావటం ప్రాచీన భాషారూపాలలో కనిపిస్తున్నా, ఆధునిక భాషలోలాగా ఈ మార్చలేని రూపాలే ఎక్కువగా ఈ కాలంలో కనిపి స్తున్నాయి. అంటే -ఇంచ్‌, -ఇంప్‌ అనే సపదాంశాలలో ఇంచ్‌ అనే సపదాంశమే అన్ని పరిసరాల్లోకి వ్యాపించటం 13 వ శతాబ్ది నుంచీ ప్రారంభమై (కందప్పచెట్టి § 3.12; § 5.43.) ఈ యుగంలో పూర్తిగా స్థిరపడింది. ఉదా. చేయించ్‌-అక (SII 10.765.89, 1678), కట్టించు-ము. (KI 48.6,1613). (4) త్యక్షర ధాతువుల్లోని రెండవ అక్షరంలోని ఉ తాలవ్యాచ్చుకు ముందు ఇ గాను, ఆ కు ముందు అ గాను మారుతుంది. ఉదా. చదువు : చదివి (SII 5. 1208. 34,1772), కొలుచు: కౌలవగాను (SII 10.748.7,1577). (5) కాలవాచి ప్రత్యయంలోని తకారం ప్రాతిపదికాంత న కారంపైన ట గా మారుతుంది. 18వ శతాబ్ది నాటికే ఇలాంటి రూపాలున్న ఆధారాలున్నా ( కేతన: 26 ) శాసనాల్లో ఇలాంటి రూపాలు మొదటి సారిగా కనిపిస్తున్నాయి. ఉదా. వింటిమి (<-విన్‌ -తి-మి) (SII 6.80.15 18వ శ.), వుంటిమి (-ఉన్‌ (/ఉండు +తి+మి) (SII 10.772.19,1691).

6.35. సమావక క్రియలు : సమాపక క్రియలు రెండు రకాలు- (1) సామాన్య (Simple). (2) అనేక పదనిర్మాణం కలవి (Periphrastic). (1).సామాన్య సమాపక క్రియలు క్రియా ప్రాతిపదిక + కాలవాచి ప్రత్యయం + పురుష-వచన ప్రత్యయం నిర్మాణంలో ఉంటాయి. ప్రాచీన భాషలోని భూతకాల, తద్ధర్మార్థక, వ్యతి రేకార్ధక క్రియలు, ఆధునిక భాషలోని భవిష్యదర్థక క్రియలు సామాన్య సమాపక క్రియలు. ఉదా. చేసిరి (NI 2 కందుకూరు 41.80, 1693). పోదురు (SII 5.120.8,1640), చేస్తారు (NI 2 కందుకూరు 48.82,1650). (2) క్రియాజన్య విశేషణాలకు సార్వనామిక ప్రత్యయాన్ని గాని, వురుష ప్రత్యయాన్ని గాని చేర్చటంవల్ల అనేక పద నిర్మాణంకల సమాపక క్రియ లేర్పడతాయి. ప్రాచీన, ఆధునిక భాషలలోని వర్తమాన కాలక్రియలు, ప్రాచీన భాషలో భవిషత్క్రియలు, భూతకాల వ్యతిరేకార్థక క్రియలు ఈ కోవలోనికి వస్తాయి. ఉదా. చేస్తున్నారు (SII 10.759. 22,1683), సేయలేదు (SII 10.753 48,1600).